Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

విద్యార్ధులలో సృజనాత్మకతను వెలికితీసే ఒలంపియాడ్‌ పరీక్షలు

ఎంఈఓ లక్ష్మీనారాయణ

విశాలాంధ్ర`గుంటూరు వైద్యం : ఒలంపియాడ్స్‌ పరీక్షలు విద్యార్ధులలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని ఎంఈఓ ఎం.లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం స్థానిక గంగానమ్మపేటలోని శ్రీచైతన్య పాఠశాల నందు జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. విద్యా సంవత్సరం మొదటి నుంచి విద్యార్ధులు ఏకాగ్రతతో చదివి మంచి మార్కులు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలన్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్‌ పిజ్యోత్స్న మాట్లాడుతూ శ్రీచైతన్య యాజమాన్యం చేపడుతున్న వివిధ రకాల కార్యక్రమాలు ఇటువ విద్యార్ధులకు, అటు తల్లిదండ్రులకు మంచి ప్రేరణను కలిగిస్తున్నాయని చెప్పారు. గత విద్యా సంవత్సరంలో జరిగిన ఒలంపియాడ్‌ పరీక్షలలో శ్రీచైతన్య స్కూలు గంగానమ్మపేట బ్రాంచి నుంచి 107మంది విద్యార్ధులు పతకాలు సాధించారని, స్టేట్‌ నాలుగవ ర్యాంకు, ఐదవ ర్యాంకు సాధించిన విద్యార్ధులకు మెడల్స్‌, ప్రత్యేకమైన బహుమతి కిట్‌లను ఎంఈఓ చేతుల మీదుగా అందజేశారు. ఐఎన్‌టీఎస్‌ఓలో జీటీఎస్‌ఓ, ఈటీఎస్‌ఓ, ఎంటీఎస్‌ఓ, ఏటీఎస్‌ఓ, ఎస్‌టీఎస్‌ఓ పరీక్షలు నిర్వహించగా ముగ్గురు విద్యార్ధులు స్టేట్‌ లెవల్‌ బహుమతి పొందటం గర్వకారణంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏజీఎం అంజయ్య, ఆర్‌ఐ అప్పాజీలు పర్యవేక్షించగా, ఏఓ సాయి, డీన్‌ మల్లిఖార్జునరావు, ప్రైమరీ ఇన్‌చార్జ్‌ భాగ్యలక్ష్మీ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img