Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఆస్టియో పోరోసిస్‌ సైలెంట్‌ కిల్లర్‌ డిసీజ్‌

ఆర్దోపెడిక్స్‌, ట్రామా అండ్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ విశ్వనాధం

విశాలాంధ్ర`గుంటూరు వైద్యం : ఆస్టియో పోరోసిస్‌ అంటే ఎముకలు గుళ్ళబారటం అని, ఇదొక సైలెంట్‌ కిల్లర్‌ డిసీజ్‌ అని ఆర్ధోపెడిక్స్‌, ట్రామా అండ్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ భవనాశి కాశీ విశ్వనాధం అన్నారు. ప్రపంచ ఆస్టియోపోరోసిస్‌ దినోత్సవం సందర్భంగా డాక్టర్‌ కాశి విశ్వనాధం ఆధ్వర్యంలో కొత్తపేట డాక్టర్స్‌ ప్లాజా సమీపంలో ఉన్న శ్రీ బాలాజీ హాస్పిటల్స్‌లో ‘‘ఉచిత ఎముకలు, కీళ్ళు వైద్య శిబిరం’’గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్‌ కాశి విశ్వనాధం మాట్లాడుతూ నేటి మన ఆధునిక జీవన శైలిలో వస్తున్న మార్పుల వలన 40సంవత్సరాలు పైబడిన చాలా మంది ఆస్టియోపోరోసిస్‌ వ్యాధి బారినపడుతున్నట్లు చెప్పారు. ఆస్టియో పోరోసిస్‌ వలన చిన్నపాటి కుదుపులకు ఎముకలు విరగడం..పెళుసుబారటం జరుగుతుంటాయన్నారు. ఇటువంటి నేపధ్యంలో ఆర్ధికంగా వెనుకబడిన పేదలకు, ఎముకలకు సంబందించిన సమస్యలతో బాధపడుతున్నవారికి రూ.2వేలు విలువ గల బీఎండీ టెస్టును ఉచితంగా చేశామని పేర్కొన్నారు. అలాగే తీవ్ర నడుము నొప్పి ఉన్నవారికి..శరీరంలో అన్ని చోట్ల ఎముకలు నొప్పులుగా ఉన్న వారికి షుమారు 69మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు కూడా ఇవ్వటం జరిగిందని చెప్పారు. ఇంకా పేషంట్‌కు అవసరమైన పరీక్షల్లో రాయితీలు ఇచ్చి వైద్య పరీక్షలు చేసినట్లు తెలపారు. వైద్యపరంగా పేదలకు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలకు తోడుగా తాము కూడా పేదలకు కార్పొరేట్‌ వైద్య సేవలు అందించటమే తమ లక్ష్యమని డాక్టర్‌ విశ్వనాధం వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img