Friday, April 19, 2024
Friday, April 19, 2024

సంఘటిత పోరాటాలతోనే సమస్యల పరిష్కారం

సీపీఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతివరప్రసాద్‌

విశాలాంధ్ర`బొల్లాపల్లి : కార్మికులు సంఘటితమై పోరాడితేనే సమస్యలు పరిష్కారమౌతాయని సీపీఐ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.మారుతి వరప్రసాద్‌ అన్నారు. మండల కేంద్రమైన బొల్లాపల్లిలో గ్రామ పంచాయతీ కార్మికుల సమావేశం సీపీఐ నాయకులు షేక్‌ సైదా అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మారుతివరప్రసాద్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామపంచాయతీ కార్మికులు సమస్యలతో అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన క్రింది స్థాయి కార్మికుల జీవితాల్లో మాత్రం మార్పు రాలేదన్నారు. పాలకులు స్వార్థ ప్రయోజనాలతో పాలించడం తప్ప పేద వర్గాలకు మేలు చేస్తుందేమిలేదన్నారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. కార్మికులు సంఘటితమై ప్రభుత్వం కొనసాగిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని మారుతివరప్రసాద్‌ పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ కార్మికుల పోరాటాలకు సీపీఐ మద్దతు పలుకుతుందని ఆయన అన్నారు. వినుకొండ నియోజకవర్గం కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. కార్మికులు బ్రతుకు కొనసాగించడం దుర్భరంగా ఉందన్నారు. ప్రభుత్వం కార్మికుల సమస్యల పట్ల సానుకూలంగా గౌరవించాలని బూదాల శ్రీనివాసరావు కోరారు. ఈ సమావేశంలో సీపీఐ బొల్లాపల్లి మండల కార్యదర్శి పిన్నెబోయిన వెంకటేశ్వర్లు, గ్రామపంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img