Saturday, October 1, 2022
Saturday, October 1, 2022

కొడాలి నానికి శ్రద్ధాంజటి ఘటించిన టీడీపీ శ్రేణులు

విశాలాంధ్ర`పెదకూరపాడు : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ బాబుపై, నందమూరి కుటుంబంపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మండల టీడీపీ ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించారు. అధ్యక్షులు అర్తిమళ్ళ రమేష్‌ మాట్లాడుతూ కొడాలి నానికి చంద్రబాబు రాజకీయ బిక్ష పెడితే కొడాలి నాని ఎమ్మెల్యే అయ్యాడని, ఆయన కాళ్ళ కింద బ్రతికి ఈ రోజు మంత్రి పదవి కోసం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన విధంగా నాని స్థాయికి మించి మాట్లాడుతున్నారన్నారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోని మసులుకోవాలని లేకపోతే రాష్ట్ర ప్రజలు గుండు గీకి సున్నపు బొట్లు పెట్టి గాడిద మీద ఊరేగిస్తారని హెచ్చరించారు. అనంతరం కొడాలి నానికి శ్రద్ధాంజలి ఘటించి పోస్టర్లను దగ్ధం చేసి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ రామగోపాలరావు, మాజీ ఎంపీటీసీ షేక్‌ ముంతాజ్‌, మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు సరిపూడి కృష్ణకుమారి, అజుముల్లా, మాజీ మార్కెట్‌ యార్డ్‌ డైరెక్టర్‌ ఏటుకూరి బ్రహ్మయ్య, రఘు, నియోజకవర్గ తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు కొండ్రు పద్మలత, మాజీ ఎంపీపీ పాటిబండ్ల శివమ్మ, మలాట్‌ రఫి, నెల్లూరు మల్లి, తాళ్లూరి వీర వసంతరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img