Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

ప్రజా సమస్యలపై ఉద్యమాలకు సీపీఐ సిద్ధం

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని వెంకటరామారావు

విశాలాంధ్ర`నూజివీడు : రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సీపీఐ ఉద్యమాలకు సిద్ధంగా వుందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు చలసాని వెంకటరామారావు పేర్కొన్నారు. ఆదివారం నూజివీడు పట్టణ సీపీఐ సమితి సమావేశం పట్టణ పార్టీ నాయకులు వేణుగోపాలరావు అధ్యక్షతన స్థానిక అమర్‌భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న రామారావు దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రసంగించారు. రాష్ట్రంలో కేంద్రానికి తలొగ్గి పట్టణ ప్రజలపై పన్నుల భారాన్ని మోపడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటున్నదన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉధ్యమించడానకి ప్రతి సీపీఐ కార్యకర్త సిద్దంగా వుండాలన్నారు. ప్రజలను సమస్యలపై ఉధ్యమించే విధంగా చైతన్యం చేయడం కోసం, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేఖంగా పలు కార్యక్రమాలను చేయాలని సమావేశంలో నిర్ణయించారు. 9న సేవ్‌ ఇండియా కార్యక్రమం, 11న టిడ్కో ఇళ్ళపై ఆందోళన, 17 నుండి పట్టణంలో పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి బత్తుల వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్‌ ఇందుపల్లి సత్యప్రకాష్‌, పట్టణ కార్యదర్శి సిహెచ్‌.పుల్లారావు, సహాయకార్యదర్శి జాన్‌బాబు, అల్లు నాగేశ్వరరావు, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img