Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రూ.50లోపు రుణమాఫీకి కేసీఆర్‌ ఆదేశం..

అనాధ పిల్లల శరణాలయాల స్థితిగతుల అధ్యయనానికి సబ్‌ కమిటీ
వచ్చే విద్యా సంవత్సరానికి కొత్త వైద్య కళాశాలలు అందుబాటులోకి
ఇబీసీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఐదేళ్ల సడలింపు
టీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

హైదరాబాద్‌ : తెలందగాణ రైతులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త అందించారు. రూ.50వేల లోపు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేసేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈనెల 15వతేదీలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం ప్రగతి భవన్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకొని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది రైతులు లబ్ది పొందనున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు పంట రుణ మాఫీకి సంబంధించిన వివరాలను కేబినెట్‌ ముందుంచిన ఆర్ధిక శాఖ. కరోనా కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై భారం వల్ల, గత రెండు సంవత్సరాలుగా రూ.25వేలు వరకు ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేశారు. ముందుగా జిల్లాల్లో కొవిడ్‌ పరిస్థితులు, కొవిడ్‌ వల్ల అనాథలయిన పిల్లలు, అనాథ శరణాలయాల స్థితిగతులు, సమస్యలపై సమీక్షించారు.
జిల్లాల్లో కరోనా పరిస్థితి, వాక్సినేషన్‌, ఆస్పత్రుల్లో ఏర్పాట్లపై చర్చించారు. కొవిడ్‌ వల్ల అనాథలైన పిల్లల వివరాలు సేకరించాలని అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి సమగ్ర సమాచారం తెప్పించాలని వైద్యశాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.
సబ్‌ కమిటీ ఏర్పాటు…
అనాథలు, అనాథ శరణాలయాల స్థితిగతులు, సమస్య లపై మంత్రిమండలి సమావేశంలో సమీక్షించారు. అవగా హన, విధాన రూపకల్పన కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాధోడ్‌ అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. సబ్‌ కమిటీ సభ్యులుగా హరీశ్‌ రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, తలసాని, కొప్పుల, గంగుల, ఇంద్రకరణ్‌ రెడ్డి, జగదీశ్‌ రెడ్డి ఉన్నారు.
జిల్లాల్లో కరోనా పరిస్థితిపై చర్చ….
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంపై కేబినెట్‌లో చర్చించారు. కేసుల కట్టడికి సంబంధించి జిల్లాల్లో తీసుకుంటున్న చర్యలు, ఆక్సిజన్‌, పడకలు, ఔషధాలపై సమీక్షించిన మంత్రిమండలి జిల్లాల్లో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని మంత్రి వర్గం ఆదేశించింది. పరీక్షలతో పాటు వాక్సినేషన్‌ వేగవంతం చేయాలని తెలిపింది. ఔషధాలు, ఆక్సిజన్‌ కొరత లేకుండా చూడాలని వైద్యాధికారులుకు ఆదేశించారు. నూతన వైద్య కొత్తగా మంజూరు చేసిన 7 వైద్య కళాశాలల ప్రారంభంపై చర్చ జరిగింది. వచ్చే విద్యా సంవత్స రమే వైద్య కళాశాలలు ప్రారంభించాలని నిర్ణయిం చారు. కొత్త వైద్య కళాశాలకు భవన నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పనపై సమాలోచ నలు జరిపారు. భవిష్యత్‌లో మంజూరయ్యే వైద్య కళాశాలలకు స్థలా లు చూడాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో వ్యవసాయం తీరుపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, పంటలు, సాగునీటి లభ్యత, ఎరువులు, ఇతర వ్యవసాయ అంశాలపై కేబి నెట్‌లో చర్చించారు. పత్తిసాగుపై ప్రత్యే కంగా చర్చిం చారు. తెలంగాణ పత్తికి ఉన్న ప్రత్యేక డిమాండ్‌ వల్ల సాగును ఇంకా పెంచాలని, అందుకోసం రాష్ట్ర రైతాంగాన్ని సమాయత్తపరచాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశిం చారు. అలాగే కేంద్రం ప్రవేశపెట్టిన ఈబీసీ రిజర్వేషన్‌ కోటాకు, విద్యా ఉద్యోగ అవకాశాల్లో 8 లక్షల లోపు ఆదా యం ఉన్న ఇబిసి కేటగిరి అభ్యర్థులు అర్హులని కేబినెట్‌ తీర్మానించింది. ఇబిసి కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయో పరిమితిలో 5 సంవత్సరాల సడలింపునివ్వాలని నిర్ణయించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img