Homeజిల్లాలుశ్రీ సత్యసాయిభారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చెయ్యాలి...

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చెయ్యాలి…

- Advertisement -

వామపక్షాల నాయకులు డిమాండ్

విశాలాంధ్ర ధర్మవరం;; భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా
వామపక్షాలు ,సిపిఐ,సిపిఎం,ఏఐయూసీ,సీఐటీయూ, నాయకులు సిపిఎం కార్యాలయం లో పత్రిక విలేకరుల సమావేశంలో జంగాలపల్లి పెద్దన్న, ముసుగు మధు, మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని, ఎన్నికల కమిషనర్ నియామక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని భాగస్వామ్యం చేయాలని తెలిపారు. ఎస్ ఐ ఆర్ ప్రక్రియను రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం 10 గంటలకి కళాజ్యోతి సర్కిల్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం నాయకులు ఎస్ హెచ్ భాషా, జె.వి.రమణ, రైతు సంఘం నాయకులు మారుతి, సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, ఏఐటీయూసీ నాయకులు ఎర్రం శెట్టి రమణ, ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు గుర్రం వెంకటస్వామి,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు