Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

అఫ్గాన్‌లో ఉక్రెయిన్‌ విమానం హైజాక్‌!

కాబూల్‌ : ఉక్రెయిన్‌ విమానం హైజాక్‌కు గురైంది. ఉక్రెయిన్‌ ప్రభుత్వం అఫ్గాన్‌లో ఉన్న తమ పౌరులను తరలిస్తున్న క్రమంలో గుర్తు తెలియని దుండగులు విమానాన్ని కాబూల్‌ విమానాశ్రయం నుండి ఇరాన్‌కు మళ్లించినట్లు ఉక్రెయిన్‌ డిప్యూటీ విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ఈ విమానం గత వారమే కాబూల్‌ విమానాశ్రయానికి చేరుకుంది. 83 మంది ప్రయాణీకులు ఉన్న ఈవిమానంలో గుర్తు తెలియని ప్రయాణీకులు ఉన్నట్లు తెలుస్తోంది. గత ఆదివారం విమానం కాబూల్‌లో హైజాక్‌కు గురైంది. మంగళవారం ఆ విమానాన్ని తమ నుండి దొంగిలించి ఇరాన్‌కు తీసుకెళ్లారని రష్యా న్యూస్‌ ఏజన్సీ తెలిపింది. హైజాకర్ల వద్ద ఆయుధాలు ఉన్నట్లు సమాచారం. అయితే విమానం హైజాక్‌ వార్తలను ఇరాన్‌ ఖండిరచింది. కాబూల్‌ నుంచి వచ్చిన విమానం ఇంధనం నింపుకుని వెళ్లింది. ప్రస్తుతం మా భూభాగంలో ఉక్రెయిన్‌ విమానం లేదు అని ఇరాన్‌ స్పష్టం చేసింది. విమానాన్ని ఎవరు హైజాక్‌ చేసింది అనే దానిపై ఎటువంటి సమాచారం లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img