Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

అఫ్గాన్‌లో తీవ్ర ఆర్థికసంక్షోభం

ఐరాస : అఫ్గానిస్తాన్‌లో మానవత్వం లోపించిందని, ఆర్థిక సంక్షోభంతో దేశం కొట్టుమిట్డాడుతోందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అఫ్గాన్‌ ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని దేశంలో ఎన్నడూ లేనంతగా ప్రజల ప్రాథమిక సేవలకు తీప్ర ముప్పు ఏర్పడుతోందని గుటెర్రస్‌ పేర్కొన్నారు. పిల్లలు, మహిళలు, పురుషులకు అంతర్జాతీయ సమాజ మద్దతు, సంఫీుభావం అత్యవసరమని పేర్కొన్నారు. భవిష్యత్తులో దేశంలో కనీస ప్రాథమిక అవసరాలకు, సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని గుటెర్రస్‌ హచ్చరించారు. ఆ దేశ జనాభాలో సగం మంది అంటే 18 మిలియన్ల మంది మనుగడకు అత్యవసర మనవతా సహాయం అవసరమని సూచించారు. ముగ్గురు అఫ్గాన్‌లలో ఒకరికి కనీస భోజనం కరువయ్యే పరిస్థితి దాపురించిందన్నారు. వచ్చే ఏడాది నాటికి ఐదేళ్లలోపు పిల్లల్లో సగానికి పైగా తీవ్ర పోషకాహారలోపంతో బాఢపడతారని అన్నారు. మానవతా విలువలతో వచ్చే నాలుగునెలల కాలానికిగాను తక్షణ అవసరాల నిమిత్తం నిధులు విడుదల చేస్తామన్నారు. అఫ్గాన్‌ భూభాగం నుండి అమెరికా సేనల తరలింపు ప్రక్రియ అనంతరం దేశం నుంచి పారిపోవడానికి ప్రజలు తహతహలాడిన విధానాన్ని గుటెర్రస్‌ నొక్కి చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img