Friday, September 30, 2022
Friday, September 30, 2022

అఫ్గాన్‌ సరిహద్దులో ఆత్మాహుతి దాడి

ముగ్గురు పాక్‌ సైనికులు మృతి
20 మందికి గాయాలు
క్వెట్టా : పాకిస్థాన్‌లోని క్వెట్టా ప్రావిన్స్‌లోని మియాన్‌ ఘుండీ ప్రాంతంలో బాంబు పేలింది. అఫ్గాన్‌ సరిహద్దు చెక్‌ పోస్ట్‌కు సమీపంలో బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి ఆత్మాహుతికి పాల్పడ్డాడు. సరిహద్దు వద్ద పహారా ఉండే ఫ్రాంటియర్‌ కానిస్టేబులరీ గార్డ్స్‌ లక్షంగా దాడి జరిగిందని క్వెట్టా డిప్యూటీ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ అజార్‌ అక్రమ్‌ తెలిపారు. ఈ దాడిలో ముగ్గురు పాకిస్థాన్‌ పారామిలటరీ జవాన్లు మరణించారని, మరో 20 మందికి గాయాలయ్యాయని చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని, గాయపడిన వారిలో జవాన్లతో పాటు పౌరులున్నారని అన్నారు. ఈ దాడి చేసినది తామేనంటూ తెహ్రీక్‌ తాలిబాన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) ఉగ్ర సంస్థ ప్రకటించుకుంది. కాగా, ఫ్రాంటియర్‌ కానిస్టేబులరీ గార్డ్స్‌ చెక్‌పోస్ట్‌పైఉగ్రదాడిని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఖండిరచారు. ఈ ఘటనలో చనిపోయిన జవాన్లకు సంతాపాన్ని వారి కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విదేశీ అండదండలతోనే ఉగ్రవాదులు రెచ్చిపోతున్నట్లు పేర్కొన్నారు. ఉగ్రవాద వ్యతిరేక పోరులో అమరులైన తమ దేశ జవాన్ల త్యాగాలకు సెల్యూట్‌ అంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img