Wednesday, November 30, 2022
Wednesday, November 30, 2022

అబే మృతికి ప్రధాని మోదీ శ్రద్ధాంజలి

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబేకు ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు. అబే గొప్ప నాయకుడు, అసాధారణమైన వ్యక్తిగా మోదీ శ్లాఘించారు. భారత్‌జపాన్‌ స్నేహాన్ని విశ్వసించే వ్యక్తిగా అబేను కీర్తించారు. కోట్లాది మంది హృదయాల్లో అబే జీవించిఉంటారని మోదీ ట్వీట్‌ చేశారు. భారత్‌జపాన్‌ భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో అబే చూపించిన అపారమైన సహకారానికి ఘన నివాళి అని మోదీ పేర్కొన్నారు. భారత్‌-జపాన్‌ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలోనూ, స్వేచ్చ, బహిరంగ, సమ్మిళిత ఇండో-పసిఫిక్‌ ప్రాంతం దార్శనికతను రూపొందించడంలో దివంగత జపాన్‌ ప్రధాని సహకారం మరువలేనిదని అన్నారు. జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదాతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఆ ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. అనేక ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలు, భారత్‌, జపాన్‌ వ్యూహాత్మక సంబంధాల గురించి కూడా మాట్లాడుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img