Friday, August 19, 2022
Friday, August 19, 2022

అమెరికాలో 46 మంది వలస కార్మికుల మృతి

టెక్సాస్‌ : అమెరికాలోని వలసలు విషాదాంతంగా మారుతున్నాయి. టెక్సాస్‌లోని శాన్‌ ఆంటోనియోలో వలసదారులతో ఉన్న ట్రక్కులోని 46 మంది మృతిచెందిన విషాద సంఘటన సోమవారం చోటుచేసకుంది. సజీవంగా ఉన్న 16 మంది చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించడమైంది. వీరిలో 12మంంది పెద్దవారుకాగా నలుగురు పిల్లల ఉన్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. అక్రమ వలసలకు మార్గమైన అమెరికా`మెక్సికో సరిహద్దులోని 250 కిలోమీటర్ల దూరంలో శాన్‌ ఆంటానియో దక్షిణ శివారులో రైలు పట్టాల పక్కనే ఓ ట్రక్కును వదిలేసి డ్రైవరు వెళ్లిపోయాడు. సాయంత్రం సమయంలో ట్రక్కు నుంచి ఆర్తనాదాలు రావడంతో ఓ కార్మికుడు దగ్గరకు వెళ్లి పరిశీలించగా ట్రక్కు తలుపు పాక్షికంగా తెరవబడిఉంది. అందులో చాలా మంది మృతిచెందగా ప్రాణాలతో ఉన్నవారి ఉష్ణోగ్రతలు ఎక్కువగాఉన్నట్లు తెలిపారు. కార్మికుడి సమాచారంతో ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. సోమవారం శాన్‌ ఆంటోనియోలో 103 డిగ్రీల ఫారెన్‌హీట్‌ నమోదైంది. వాహనంలో నీటి సంకేతాలు లేదు.
రిఫ్రిజిరేటెర్‌ కానీ ఏసీ యూనిట్‌కాని పనిచేస్తున్నట్లు లేవని శాన్‌ ఆంటోనియో మేర్‌ రాన్‌ నిరెన్‌బర్గ్‌ విలేకరులతో తెలిపారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వీరంతా ఊపిరాడక ఎండవేడికి మృతిచెందినట్లు పేర్కొన్నారు. మెక్సికో నుంచి అక్రమవలసదారులు అమెరికాకు ఎక్కువ సంఖ్యలో ట్రక్కులో వెళుతుంటారు. గతంలో కూడా వలసదారులతో వెళుతున్న మెక్సికోకు చెందిన ట్రక్కులు ప్రమాదానికి గురికావడంతో పదుల సంఖ్యలో మెక్సికన్లు మృతిచెందిన ఘటనలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img