Monday, October 3, 2022
Monday, October 3, 2022

అర్మీనియా సీపీ ప్రధాన కార్యదర్శిగా గజారియన్‌

అర్మీనియా : కమ్యూనిస్టుపార్టీ ఆఫ్‌ అర్మీనియా ప్రధాన కార్యదర్శిగా యెర్జానిక్‌ గజారియన్‌ ఎన్నికయ్యారు. అర్మీనియా కమ్యూ నిస్టు పార్టీ ప్లీనం సందర్భంగా జరిగిన ఎన్ని కల్లో గజారియన్‌ ఏకగ్రీవంగా తిరిగి ఎన్నిక య్యారు. అర్మీనియాలోని అంతర్గత రాజకీయ సంక్షోభం, అర్మీనియారష్యా సంబంధాలు, రానున్న స్థానిక ఎన్నికలు, పార్టీ చేపట్టనున్న తదుపరి చర్యలపై గజారియన్‌ ప్రసంగించారు. అర్మీనియా పార్టీ బలోపేతానికి, ప్రజాప్రయోజ నాలు కాపాడేందుకు, పెట్టుబడీదారీ వ్యవస్తపై పోరాటానికి అత్యంత శక్తివంతమైన నాయకుడిగా గజారియన్‌ను కమ్యూనిస్టు పార్టీల యూనియన్‌ మొదటి ఉపాధ్యక్షుడు, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ సోవియట్‌ యూనియన్‌ ప్రథమ వైస్‌ చైర్మన్‌ (యూసీపీసీపీఎస్‌ యూ)కజ్బెక్‌ పేర్కొన్నారు. దేశంలో సామాజిక న్యాయ స్థాపనకు గజారియన్‌ కట్టుబడి ఉంటారని సమర్థించారు. రష్యా`అర్మీనియాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన సహకారం, సమగ్రతను మరింతగా అభివృద్ధి చేసేందుకు ఉమ్మడి కార్యాచరణ పథకాల ద్వారా దేశంలో నూతన విజయాలు సాధించగలమని కజ్బెక్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img