Wednesday, August 17, 2022
Wednesday, August 17, 2022

ఆ ఇద్దరూ గద్దె దిగేంతవరకు పోరు కొనసాగిస్తాం : నిరసనకారులు

అధ్యక్ష, ప్రధానులిరువురూ గద్దె దిగేంతవరకు తాము ఆ ఇరువురి నేతల అధికారిక నివాసాలను వీడే ప్రశ్నే లేదని నిరసనకారులు మరోసారి తేల్చి చెప్పారు. అధ్యక్షుడు గొటాబయ ఈ నెల 13న (బుధవారం) రాజీనామా చేయనున్నట్లు స్పీకర్‌ అబేయ వర్థనే చెబుతున్నప్పటికీ, అధ్యక్షుడి నుంచి మాత్రం అధికారికంగా ఇంతవరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. పాలు, పిల్లల ఆహారం వంటి నిత్యావసర సరుకుల కొరతపై ఆగ్రహౌదగ్రులైన శ్రీలంక ప్రజలు శనివారం ఒక్కసారిగా వెల్లువలా వచ్చి కొలంబోలోని అధ్యక్ష, ప్రధాని అధికారిక నివాసాలను, సెక్రటేరియట్‌ను ముట్టడిరచారు. అప్పటి నుంచి రేయింబవళ్లు అక్కడే బైఠాయించారు. గొటాబయ, రణిల్‌ విక్రమ సింఘె అధికారిక నివాసాలను వీడి నేవీ స్థావరాల్లో తలదాచుకున్నారు. అధ్యక్ష, ప్రధాని నివాసాల్లోకి ప్రవేశించిన నిరసనకారులు ప్యాలెస్‌లో భోజనాలు చేశారు. భవనంలోని స్విమ్మింగ్‌ పూల్‌లో కొంతమంది ఈత కొట్టగా.. మరికొందరు అక్కడి జిమ్‌లో కసరత్తులు చేశారు. అవినీతి నుంచి విముక్తి లభించిందని, అందుకే సంబరాలు చేసుకుంటున్నామని నిరసనకారులు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img