ఏథెన్స్ : గ్రీస్అమెరికా మధ్య రక్షణ ఒప్పందం సవరణను కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ గ్రీస్ (కేకేఈ) తీవ్రంగా ఖండిరచింది. గ్రీస్ విదేశీ వ్యవహారాల మంత్రి నికోస్ డెండి యాస్, ఆంథోనీ బ్లింకెన్ మధ్య వాషింగ్టన్లో కుదరిన సవ రణపై ప్రకటన చేశారు. ఇది అమెరికా, నాటోల మధ్య యుద్ధ ప్రణాళికలను మరింత చిక్కుల్లో పడేస్తుందని పేర్కొంది. అఫ్గాన్‌పై యుద్ధానికి అమెరికా విదేశాంగ కార్యదర్శి గ్రీస్ సహకారం గురించి ప్రస్తావించడం అఫ్గాన్‌లో గ్రీస్‌పై మరిన్ని కొత్త కేసులను సూచిస్తుందని పేర్కొంది. కాగా ఈ తాజా ఒప్పందం 5సంవత్సరాలు పొడిగించడమైంది. తరువాత ఇది నిరవధికంగా అమలులోఉంటుంది. ఈ ఒప్పందంలో భాగంగా గ్రీస్‌ను అమెరికా
నాటో దళాల సామ్రాజ్యవాద కోటగా మారు స్తుందని హెచ్చరించింది. అమెరికా మిలిటరీ దళాల అవసరాల కోసం సైనిక శిబిరాలు,మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలకోసం, నాటో 2030 వ్యూహంలో భాగంగా రష్యా, చైనాతో పాటీకి సంబంధించి తూర్పు ఐరోపాకు సైనికదళాల పునర్వ్యవస్థీకరణ, అమెరికా సైన్య కార్యకలాపాలకోసం అలెగ్జాండ్రోపోలిస్ని మెరుగుపరచడం ఈ లక్ష్యంలో భాగంగా ఉంది. గ్రీస్ సార్వభౌమ హక్కులకు, అంతర్జాతీయ చట్టానికి భంగం కలిగించే అమెరికా విదేశాంగశాఖ ఒప్పందం మోసపూరితమైనదిగా కేకేఈ పేర్కొంది.