Monday, January 30, 2023
Monday, January 30, 2023

ఇంధన సంక్షోభం పరిష్కరించాలి : పుతిన్‌

రష్యా : రష్యాలో యూరోపియన్‌ ఇంధన సంక్షోభాన్ని నిరోధించాలని పుతిన్‌ పిలుపునిచ్చారు. నవంబరు 1లోపు యూరోపియన్‌ ఇంధన సంక్షోభ పరిణామాలను నియంత్రిచేందుకు ప్రణాళికను రూపొందించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తన ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్‌ వెబ్‌సైట్‌ ప్రకటించింది. యూరోపియన్‌ దేశాలలో ఇంధన కొరత కారణంగా కలిగే ప్రతికూల పరిణామాల ప్రమాదాలను నివారించేందుకు రష్యా ప్రభుత్వం తగిన చర్యలు ప్రతిపాదించాలని పేర్కొన్నారు. నత్రజని ఎరువులు, మెటలర్జికల్‌ ఉత్పత్తులు, ఆహారం కోసం మార్కెట్ల అస్థిరతను పుతిన్‌ ప్రస్తావించారు. ఈ మిషన్‌కు అధిపతిగా ప్రధాని మిఖాయిల్‌ మిషుస్లిన్‌ను నియమించారు. స్పాట్‌ గ్యాస్‌ ధరలు 1000 క్యూబిక్‌మీటర్ల ఇంధనానికి 1000 డాలర్లకుపైగా పెరిగాయని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img