Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

ఇజ్రాయిల్‌లో వామపక్ష సంఘటనకు ఐదు స్థానాలు

జెరూసలేం: ఇజ్రాయిల్‌లో వామపక్ష సంఘటన సత్తా చాటింది. ఇజ్రాయిలీ పార్లమెంటు (నెస్సెట్‌)లో ఐదు స్థానాలను కమ్యూనిస్టు పార్టీ మద్దతున్న హదాశ్‌తాల్‌ గెలుచుకుంది. ఈనెల 1న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 32 స్థానాలు గెలుచుకొని నెతన్యాహు లికుడ్‌ పార్టీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలింది. ప్రతిపక్షంలో ఉన్న ఎనిమిది పార్టీల్లో హదాశ్‌తాల్‌, అరబ్‌ బలాడ్‌ పార్టీ ఉన్నాయి. 2,330,464 ఓట్లను ఇవి పొందాయి. ఫలితాలపై హదాశ్‌ చైర్మన్‌, ఎంపీ ఐమన్‌ ఓడే స్పందించారు. ఫాసిజాన్ని, వివక్షజాత్యహంకారాన్ని వ్యతిరేకంగా ప్రజలు బలంగా నిలవాలన్నారు. హర్దాశ్‌ ఎంపీ ఐడా తౌమాస్లిమన్‌ మాట్లాడుతూ, తాజా ఎన్నికల వాస్తవికత ప్రతి ఒక్కరికి భయానకం… ఆత్మపరిశీలనకు ఇది సమయం అని అన్నారు. ‘వామపక్షం మరోమారు వీధుల్లోకి వచ్చింది’ అన్న శీర్షికను ఇజ్రాయిల్‌ కమ్యూనిస్టు పార్టీ అధికారిక గెజేట్‌ ‘జో హర్దేరీచ్‌’ ప్రచురించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img