Tuesday, March 21, 2023
Tuesday, March 21, 2023

ఉక్రెయిన్‌ సరిహద్దుల నుండి రష్యా దళాల ఉపసంహరణ

ఉక్రెయిన్‌: కొన్ని వారాల నుంచి ఉక్రెయిన్‌ సరిహద్దులో కొనసాగుతున్న సంక్షోభాన్ని తగ్గించేందుకు రష్యా సంకల్పించింది. ఏం జరగబోతుందో అనే ఆందోళన ప్రపంచమంతా నెలకొన్న సమయంలో రష్యన్‌ దళాలను ఉక్రెయిన్‌ సరిహద్దులను ంచి ఉపసంహరించుకున్నట్లు రష్యా ప్రకటించింది. అమెరికా అనుకూల ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చేస్తుందన్న ప్రచారాల మధ్య రష్యా తాజాగా తమ దళాలను వెనక్కి రప్పించింది. ఉక్రెయిన్‌ సరిహద్దులో లక్షమందికి పైగా దళాలు మోహరించిన విషయం తెలిసిందే..తమ దళాల విన్యాసాలు పూర్తయ్యాయని తిరిగి తమ స్థావరాలకు చేరుకుంటున్నాయని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఐగర్‌ కొనషెంకొవ్‌ ప్రకటించారు. సదరన్‌, వెస్టర్న్‌ మిలిటరీ యూనిట్లు వాటి పనిపూర్తిచేశాయన్నారు. అవి రైలు, రోడ్డు మార్గాల్లో ప్రయాణిస్తాయని తెలిపారు. రష్యాప్రభుత్వ కార్యనిర్వాహక శాఖ క్రెమ్లిన్‌ ప్రతినిధి డిమిట్రి పెస్కోవ్‌ మాట్లాడుతూ దీనిలో కొత్త విషయం లేదన్నారు. ఇదంతా సాధారణంగా జరిగే ప్రక్రియేనని అన్నారు. పాశ్చాత్య దేశాల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఉక్రెయిన్‌ ఆక్రమణలో భాగంగా బుధవారం రష్యా బలగాలు దాడికి దిగుతాయని తమకు సమాచారం అందినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్ల్లాదిమిర్‌ జెలన్‌ స్కీ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు అమెరికా సైతం ఇదే హెచ్చరికను జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం నుంచి చాలావరకు సైన్యాన్ని బేస్‌కు రప్పించుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ల మధ్య గంటపాటు చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.రష్యా నుంచి జర్మనీ వరకు వెళ్లే గ్యాసు పైపులైన్‌ (నార్డ్‌ స్ట్రీమ్‌`2) ప్రాజెక్టును పూర్తిగా నిలిపివేస్తామని బైడెన్‌ పుతిన్‌ను హెచ్చరించినట్లు సమాచారం.
నార్డ్‌స్ట్రీమ్‌ అంటే..
నార్డ్‌ స్ట్రీమ్‌ పైప్‌ లైన్‌ 1200 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్‌. పశ్చిమ రష్యా నుంచి ఈశాన్య జర్మనీకి బాల్టిక్‌ సముద్రం ద్వారా వెళ్లే పైప్‌లైన్‌. 83 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు ఇది. అయితే 2021 లోనే పూర్తైనట్లు సమాచారం. కొన్ని అత్యావశ్యకమైన అనుమతులు రావాల్సి వుంది. ఇది ఇంకా ప్రారంభం కాలేదు. దీని ద్వారా జర్మనీకి 55 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ సరఫరా అవుతుంది. జర్మనీలోని 2.6 కోట్ల గృహాలకు చల్లటి వాతావరణం ఉన్నా.. గ్యాస్‌ సరఫరా అవుతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి హక్కులు రష్యా ప్రభుత్వానివే. ప్రస్తుతం ఉన్న పైప్‌లైన్‌ ప్రకారం రష్యా సంవత్సరంలో 55 బిలియన్‌ క్యూబిక్‌ గ్యాస్‌ను మాత్రమే సరఫరా చేస్తుంది. ఒకవేళ కొత్త పైప్‌లైన్‌ ప్రారంభమైతే.. దీన్ని మరింత రెట్టింపు చేయవచ్చు.అమెరికా ఈ ప్రాజెక్టును అడ్డుకుంటే రష్యా ఆర్థిక మూలాలు తీవ్ర స్థాయిలో దెబ్బతింటాయి. ఆర్థిక వ్యవస్థ మూలాలు పరిపుష్టంగా ఉంచుకోవడానికి గ్యాస్‌ సరఫరాను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిఉంది.
జర్మనీతో చర్చల ఫలితంగా..
దౌత్యపరమైన చర్చల్లో భాగంగానే రష్యా తాజా నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. జర్మనీ ఛాన్సలర్‌ ఒలఫ్‌ స్కోల్జ్‌ మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరుపుతున్న నేపథ్యంలోనే దళాల వెనక్కి నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఉక్రెయిన్‌లో పరిస్థితులు వేడెక్కడంతో భారతీయులు స్వదేశానికి వచ్చేయాలనిసూచించింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి ఈ ప్రకటన విడుదలైంది.
గుటెర్రస్‌ పిలుపు : రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య పెరిగిన ఉద్రిక్తతలను తగ్గించడానికి దౌత్యం కోసం ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ పిలుపునిచ్చారు. ‘‘ బాధలు, విధ్వంసం ప్రపంచ భద్రతకు నష్టం వాటిల్లుతుందన్నారు. ఇటువంటి ఘర్షణను మేము అంగీకరించలేము,’’ అని గుటెర్రస్‌ వ్యాఖ్యానించారు. దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి , క్షేత్రస్థాయిలో చర్యలను అమలుకు ఇప్పుడు సమయం ఆసన్నమైంది. బహిరంగ ప్రకటనలు ఉద్రిక్తతలను తగ్గించడమే లక్ష్యంగా ఉండాలని, వాటిని రెచ్చగొట్టడం సరికాదని గుటెర్రస్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img