Monday, August 15, 2022
Monday, August 15, 2022

ఒకే దేశం, రెండు వ్యవస్థల విధానానికి కట్టుబడి ఉన్నాం : జిన్‌పింగ్‌

బీజింగ్‌: ఒక దేశం, రెండు వ్యవస్థలు అన్న విధానానికి చైనా కట్టుబడి ఉందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ వెల్లడిరచారు. ఈ ప్రాతిపదికగా హాంగ్‌ కాంగ్‌ నగరాన్ని రక్షిస్తున్నామని, ఇది సుదీర్ఘ కాలం కొనసాగుతుందని పేర్కొన్నారు. హాంగ్‌కాంగ్‌లో చైనా ఆధిపత్యాన్ని సమర్ధించుకున్న జిన్‌పింగ్‌ బ్రిటన్‌ నుంచి హాంగ్‌కాంగ్‌ను చైనాకు అప్పగించి 25 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో హాంగ్‌కాంగ్‌ను జిన్‌ పింగ్‌ సందర్శించారు. ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో చైనా రాజకీయ వ్యవస్థా విధానాన్ని వెల్లడిరచారు. రెండేళ్ల తర్వాత ఆయన స్వదేశం విడిచి బయటకు వెళ్లారు. ఒకదేశం, రెండు వ్యవస్థల వల్ల హాంగ్‌ కాంగ్‌కు స్వేచ్ఛ లభిస్తుందని, భావ స్వేచ్ఛను రక్షిస్తుందని, చైనాలో లేని హక్కుల్ని ఇక్కడ పొందవచ్చునన్నారు. ఈ సందర్భంగా వందలాది మంది హాంకాంగ్‌ యువకులు, సభ్యులు హాంకాంగ్‌ పోలీస్‌ బ్యాండ్‌ చేపట్టిన స్వాగత కార్యక్రమంలో జెండాలు, పువ్వులతో స్వాగతం పలికారు. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ హాంకాంగ్‌ స్వదేశీయులను అభినందిస్తూ, హాంకాంగ్‌ మాతృభూమికి తిరిగి వచ్చిన 25వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. హాంగ్‌కాంగ్‌ గురించి తాను ఎప్పటి నుంచో ఆందోళన చెందుతున్నానని నా హృదయం, ప్రభుత్వ హృదయం ఎల్లప్పుడూ హాంకాంగ్‌ స్వదేశీయులతోనే ఉంటాయని పేర్కొన్నారు. ప్రమాదాలు, సవాళ్లను అధిగమించి హాంకాంగ్‌ మరింత పటిష్టంగా ఆవిర్భవించిందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img