Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

కర్బన ఉద్గారాల నియంత్రణే లక్ష్యం

చైనా`ఈయూ దేశాల వాణిజ్యయత్నాలు

చైనాఈయూ దేశాల వాణిజ్యయత్నాలు బ్రస్సెల్స్‌ : కాలుష్యరహిత సుస్థిరాభివృద్ధికి మద్దతిచ్చే వ్యాపార ప్రయత్నాలకు చైనా, యూరోపి యన్‌ యూనియన్‌(ఈయూ) ప్రతినిధులు శ్రీకారం చుట్టారు. చైనాఈయూల మధ్య గ్రీన్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సమావేశాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించారు. గ్రీన్‌ ఫైనాన్స్‌ వృద్ధిని సులభతరం చేసే మార్గాలపై చర్చించేందుకు యూరోపియన్‌ కౌన్సిల్‌ మాజీ అధ్యక్షుడు హర్మన్‌ వాన్‌ రోంపూయ్‌, లక్సెంబర్గ్‌ ఆర్థికమంత్రి పియరీ గ్రామెగ్నా సహా వందలాది మంది వ్యాపారులు, బ్యాంకింగ్‌ నిపుణులు, పరిశోధకులు, ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. దేశీయ లక్ష్యాలు సాధించేందుకు చైనా, ఈయూ దేశాలకు అంతర్జాతీయ సహకారం ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. వాతావరణ తటస్థతను చేరుకోవడం ప్రాథమిక లక్ష్యంగా నిర్ణయించారు. 2030కి ముందు కర్బన ఉద్గారాలు గరిష్టాన్ని 2060 నాటికి తటస్థతను సాధించాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. 2050 నాటికి వాతావరణం తటస్థంగా మారాలని 1990 స్థాయితో పోలిస్తే 2030 నాటికి కనీసం 55శాతం కర్బన ఉద్గారాలను తగ్గించాలని ఈయూ లక్ష్యంగా చేసుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో ఈయూ కమిషన్‌ ఉద్గార వాణిజ్య పథకాన్ని ‘ఫిట్‌ఫర్‌ 55’ గా పిలువబడే ప్యాకేజీని వచ్చేవారం విడుదల చేస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img