Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

కోవిడ్‌ ప్రతిస్పందనలో చైనా నిర్ణయాత్మక విజయం

బీజింగ్‌ : కోవిడ్‌ ప్రతిస్పందనలో నిర్ణయాత్మక విజయం సాధించినట్లు చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) ప్రకటించింది. 2022 నవంబరు నుంచి కోవిడ్‌పై పోరు సాగుతోందని, దానిని దాదాపుగా కట్టడి చేయగలిగామని సీపీపీ కేంద్ర కమిటీ సమావేశం వెల్లడిరచింది. సమావేశాన్ని సీపీసీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి జిన్‌పింగ్‌ అధ్యక్షత వహించారు. మూడేళ్ల కోవిడ్‌ కాలంలో చైనా ప్రయాణం అసాధారణమైనదిగా సీపీసీ పొలిట్‌ బ్యూరో స్టాండిరగ్‌ కమిటీ తెలిపింది. ప్రజలకు, ప్రజల ప్రాణాలకు తొలి ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొంది. కోవిడ్‌ ప్రతిస్పందన చర్యలు సజావుగా సాగాయని, 200 మిలియన్ల మందికిపైగా వైద్య సేవల్లో నిమగ్నమైనట్లు తెలిపింది. 8,00,000 తీవ్రమైన కేసులు నమదు కాగా కోవిడ్‌ మరణాల రేటు ప్రపంచ దేశాల కంటే తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఇది మానవాళి చరిత్రలోనే అద్భుతమని, అత్యధిక జనాభా ఉన్నప్పటికీ అతితక్కువ కోవిడ్‌ మరణాలు నమోదు చేసిన దేశంగా చైనా నిలిచిందని సీపీసీ ప్రకటించింది.
త్వరలో ఇరాన్‌కు జిన్‌పింగ్‌
ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ చైనా పర్యటన ముగిసింది. తమ దేశానికి రావాలని ఆయన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ఆహ్వానించారు. ఇందుకు జిన్‌పింగ్‌ అంగీకరించి త్వరలోనే ఇరాన్‌లో పర్యటిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఇరాన్‌పై ఆంక్షలను ఎత్తివేయాలని జిన్‌పింగ్‌కు ఇబ్రహీం విజ్ఞప్తిచేశారు. అలాగే ఈ-కామర్స్‌, వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు అనేక ఒప్పందాలపై ఇద్దరు సంతకాలు చేశారు. 2015 ఇరాన్‌ అణు ఒప్పందాన్ని అమలు చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img