Monday, January 30, 2023
Monday, January 30, 2023

గ్యారోస్‌ అమరవీరులకు కేకేఈ శ్రద్ధాంజలి

ఏథెన్స్‌ : 1948 నుండి 1974 వరకు గ్రీస్‌లోని ద్వీపం గ్యారోస్‌లో జైలు శిక్షకు గురై అమరులైన వేలాది మంది కమ్యూనిస్టులు, వామపక్ష వాదుల జ్ఞాపకార్థం శనివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గ్రీకు కమ్యూనిస్టు పార్టీ (కేకేఈ) సభ్యులు, సానుభూతిపరులు, స్నేహితులు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కేకేఈ సభ్యుడు డిమిట్రిస్‌ గౌతికాస్‌ మాట్లాడుతూ..అమరవీరుల త్యాగ నిరతి, ధైర్యసాహసాలను కొనియాడారు. వారుచేపట్టిన పోరాటపటిమ అమూల్యమైనవిగా కీర్తించారు. మేము వాటిని మర్చిపోలేం.. కమ్యూనిస్టు భావజాలంపైవారి విశ్వాసం, త్యాగానికి గర్వపడు తున్నాం.. వారి త్యాగాలు వృధా కానీయం..వారుఎల్లప్పుడూ మా హృదయాలలో జీవిస్తారు అని విశ్వాసం వెలిబుచ్చారు. ఈ సమావే శానికి హాజరైన కమ్యూనిస్టు యూత్‌ (కేఎన్‌ఈ) సెంట్రల్‌ కౌన్సిల్‌ సభ్యుడు ఐసోనాస్‌ ఫోనెన్‌ మాట్లాడుతూ కేఎన్‌ఈ తరఫున అమరవీరులకు సంఫీుభావాన్ని ప్రకటించారు. కేఎన్‌ఈ పొలిటికల్‌ బ్యూరో సభ్యుబు నికోస్‌ సోఫియానోస్‌, కేఎన్‌ఈ సెక్రటరీ అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు.
17 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న జియోరా (యురా) అని పిలిచే గ్యారోస్‌ గ్రీస్‌లో భయంకరమైన ద్వీపం. ఇది సిరోస్‌ ద్వీపానికి 9 మైళ్ల దూరంలో ఉంది. గ్యారోస్‌కు మరణద్వీపం అని పేరుకూడాఉంది. ఈ చిన్న ద్వీపం మాక్రోనిసోస్‌తోపాటు సుమారు 20వేల మంది కమ్యూనిస్టు యోధులు,వామపక్ష వాదులు, అసమ్మతివాదులను దేశ బహిష్కరణ చేశారు. గ్యారోస్‌జైలులో పెట్టారు. కనీసం ఈ దీవిలో మౌలిక సదుపాయాలు కూడా లేదు. ఖైదీలు గుడారాలలో అత్యంత దయనీయ పరిస్థితుల్లో కాలం గడిపి అమరవీరులయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img