Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

గ్రీకు సోషలిస్టు నాయకురాలు ఫోఫి మృతి

ఏథెన్స్‌ : గ్రీకు సోషలిస్టు నాయకురాలు ఫోఫి జెన్నిమాటా(56) దీర్ఘకాలిక ఆనారోగ్యంతో మరణిం చారు. గ్రీస్‌లోని మూడవ అతిపెద్ద రాజకీయ పార్టీ నాయకురాలు ఫోఫీ ఈ నెల ప్రారంభంలో అనారోగ్యంతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. జెన్నిమాటా 2015 నుంచి పాన్‌ హెలెనిక్‌ సోషలిస్టు మూవ్‌మెంట్‌ నాయకురాలిగా పని చేశారు. తరువాత దీనిని మూవ్‌మెంట్‌ ఫర్‌ ఛేంజ్‌ అని పిలిచే సంస్థలో విలీనం చేశారు. అనారోగ్యం కారణంగా ఆమె డిసెంబరులో జరిగే ఎన్నికలలో తిరిగి పార్టీ నాయకురాలిగా పాల్గొననని స్పష్టం చేశారు. దీంతో మాజీ ప్రధాని జార్జ్‌పాపాండ్రియాతో సహా ఏడుగురు పార్టీ సభ్యులు తమను అభ్యర్థులుగా ప్రకటించారు. ఫోఫీ అత్యతం గౌరవప్రదమైన, ధైర్యవంతురాలిగా అధ్యక్షుడు కొనియాడారు. ఏథెన్స్‌ విశ్వవిద్యాలయం నుంచి రాజకీయ శాస్త్రంలో గ్రాడ్యుయేట్‌ అయిన ఫోఫి ప్రముఖ సోషలిస్టు రాజకీయ నాయకుడు జార్గోస్‌ కుమార్తె. 2000లో ఆమె పార్లమెంటుకు ఎన్నికయ్యారు. వివిధ క్యాబినెట్‌ పదవులను నిర్వహించారు. గ్రేటర్‌ ఏథెన్స్‌ గవర్నర్‌గా ఫోఫి నాలుగు సంవత్సరాలు పని చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img