Friday, September 30, 2022
Friday, September 30, 2022

చిన్నారులకు క్యూబాలో వాక్సిన్‌

క్యూబా : ప్రపంచంలోనే తొలిసారిగా లాటిన్‌ అమెరికా దేశమైన క్యూబా తమ చిన్నారులకు కరోనా నియంత్రణ వాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కోవిడ్‌ నియంత్రణకు చిన్నారులకు టీకాలు వేసిన మొదటి దేశంగా క్యూబా నమోదైంది. మొదటగా రెండు సంవత్సరాల వయసున్న చిన్నపిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించింది. పాఠశాలలు తిరిగి తెరవడానికి ముందు పిల్లలందరికీ టీకాలు వేయించాలని క్యూబా లక్ష్యంగా పెట్టుకుంది. క్యూబాలో పాఠశాలలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. క్యూబాలో పిల్లలకు పాఠాలు టెలివిజన్‌ ద్వారా ప్రసారమవుతున్నాయి. పాఠశాలలు తిరిగి తెరవడానికి వీలుగా పిల్లలందరికీ టీకాలు వేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. వాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగంగా క్యూబా చిన్నారులకు డిసెంబరు మధ్య నాటికి 90శాతం వాక్సినేషన్‌ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వివిధ దేశశాల్లో 12 సంవత్సరాల పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించాయి. చిలీ ఆరు నుంచి 12 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు సినోవాక్‌ వాక్సిన్‌ అందిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img