శాంటియాగో : చిలీ దేశంలోని క్విలాన్ గ్రామీణ ప్రాంతాల్లోని అడవిలో కార్చిచ్చు 13మంది ప్రాణాలు తీసింది. రాజధాని శాంటియాగోకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న బయోబయో, నుబుల్ అటవీ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. కార్చిచ్చులో 35వేల ఎకరాల్లోని చెట్లు దగ్థమయ్యాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్ని మాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారన్నారు. మంటల్లో చిక్కొకొని సిబ్బందిలో ఒకరు చనిపోగా, అత్యవసర సేవల బృందానికి చెందిన హెలికాఫ్టర్ కూలి మరో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడిరచారు. సమీప ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. ఇప్పటికే కొన్ని వందల ఇళ్లు మంటల్లో బూడిద కాగా రానున్న రోజుల్లో ప్రమాదం మరింతగా ఉండొచ్చునని అధికారులు తెలిపారు.