Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

చైనాను తొక్కేసే యత్నాల్లో పశ్చిమ దేశాలు


అమెరికా ప్రోద్బలంతోనే: జిన్‌పింగ్‌
బీజింగ్‌: తమ దేశాన్ని అణచివేశే దిశగా అమెరికా ప్రోద్బలంతో పశ్చిమ దేశాలు చకాచకా అడుగులు వేస్తున్నాయని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆరోపించారు. తమ దేశాభివృద్ధికి అడ్డంగులు సృష్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. వాణిజ్య యుద్ధం కొనసాగుతుండగా చైనా టెక్‌ దిగ్గజం హువేయిని తొక్కేయాలని అమెరికా అన్ని ప్రయత్నాలు చేస్తున్నదని జిన్‌పింగ్‌ అన్నట్లు ఈ మేరకు సౌత్‌చైనా మార్నింగ్‌ పోస్టు తెలిపింది. డేటా గోప్యత నెపంతో టిక్‌టాక్‌పై అమెరికా నిషేధం విధించింది. చైనా వార్షిక పార్లమెంటరీ సమావేశాల్లో భాగంగా జరిగిన చర్చల్లో జిన్‌పింగ్‌ మాట్లాడుతూ పశ్చిమ దేశాల తీరును ఖండిరచారు.
అమెరికాపై విమర్శలు చేశారు. తమ దేశ అభివృద్ధిపై బాహ్య ఒత్తిడి ఎక్కువైందని, ఫలితంగా సవాళ్లు పెరిగి భవిష్యత్‌ అగమ్యగోచరమవుతోందన్నారు. అంతర్జాతీయంగానే కాకుండా దేశీయంగా మారుతున్న వాతావరణం నేపథ్య సంక్లిష్ట సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవాలని అన్నారు. ఓర్పుగా ఏకాగ్రతతో సుస్థిరత, పురోగతికి సంకల్పించాలని సూచించారు. ఐక్యంగా ఉండటమే కాకుండా అవసరమైతే పోరునకూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
టెక్నాలజీలో స్వీయసమృద్ధి కోసం పటిష్ఠ చర్యలు అవస్యమని జిన్‌పింగ్‌ నొక్కిచెప్పారు. ఇదిలావుంటే ఇండో-పసిఫిక్‌ వ్యూహం ద్వారా చైనా ముట్టడికి అమెరికా యత్నిస్తోందని చైనా విదేశాంగ మంత్రి ఆరోపించారు. ప్రత్యేక బ్లాకులను ఏర్పాటు చేసి ఘర్షణలను రెచ్చగొట్టి, ప్రాంతీయ సమగ్రతకు విఘాతం కలిగించాలని చూస్తోందన్నారు. నాటోకు ఆసియా-పసిఫిక్‌ వర్షన్‌ను సృష్టించే యోచనలో అమెరికా ఉన్నట్లు వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img