Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

జర్మనీలో సోషల్‌ డెమొక్రాట్లదే విజయం

బెర్లిన్‌: జర్మన్‌ ప్రజలు మార్పుకోరుకున్నారు. 16ఏళ్ల మర్కెల్‌ పాలనకు చెక్‌ పెట్టారు. జర్మనీలో ఆదివారం జరిగిన పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు సంచలనంగా మారాయి. 16ఏళ్లపాటు జర్మనీని పాలించిన ఎంజెలా మెర్కెల్‌ పార్టీ తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. తాజాగా ముగిసిన ఎన్నికల్లో సెంటర్‌ లెఫ్ట్‌ సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీకి (ఎస్‌పీడీ) అత్యధికంగా 25.7శాతం ఓట్లు పోలయ్యాయి. మెర్కెల్‌కు చెందిన క్రిస్టియన్‌ డెమొక్రాటిక్‌ యూనియన్‌ కన్సర్వేటివ్‌ పార్టీకి 24.3శాతం ఓట్లు పోలయ్యాయి. రెండు పార్టీ లమధ్య కేవలం 1.6శాతం ఓట్ల తేడా మాత్రమే నెలకొంది. గ్రీన్‌ పార్టీ 14.5శాతం,లిబరల్‌ ఫ్రీ డెమొక్రటిక్‌ పార్టీ 11.5శాతం ఆల్టర్నేటివ్‌ ఫర్‌ జర్మనీ 10.5శాతం, ది లింకె పార్టీ 5శాతం ఓట్లను నమోదుచేశాయి. అధికారంలో ఉన్న సీడీయూ/సీఎస్‌యూ (కన్సర్వేటివ్‌) పార్టీ కంటే సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీకి పోల్‌ అయిన ఓట్ల శాతం నామమాత్రమే. ఎస్‌పీడీ పార్టీ నేత ఒలాఫ్‌ స్కోల్జ్జ్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. కన్సర్వేటివ్‌పార్టీ నేత ఆర్మిన్‌ లాషెట్‌ కూడా విపక్షాలను ఏకంచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్తగా ఏర్పడబోయే కూటమి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించాలని గ్రీన్స్‌, లిబరల్‌ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. కూటమి ఏర్పడేవరకు రాజీనామా చేయాల్సిన ఛాన్సలర్‌ క్రిస్మస్‌వరకు వేచి చూడవలసిందే… ఈయూలో జర్మనీని అత్యంత శక్తివంతమైన దేవంగా నిలిపారు. 2007లో ఆర్థికసంక్షోభం, 2016లో బెర్లిన్‌లో ఉగ్రవాద దాడులు, బ్రెగ్జిట్‌, కొవిడ్‌ ఎన్నింటినో ఆమె సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img