Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

‘జార్జి బుష్‌’కు అనుమతివ్వం

గ్రీస్‌ కమ్యూనిస్టుల భారీ ప్రదర్శన
ఏథెన్స్‌: దేశంలోని అతిపెద్ద పోర్టులో యూఎస్‌ఎస్‌ ‘జార్జ్‌ డబ్ల్యూ.బుష్‌’ ఎయిర్‌క్రాఫ్ట్‌ కెరియర్‌ను ఉంచడాన్ని గ్రీస్‌ ప్రజలు తప్పుపట్టారు. ఇందుకు వీల్లేదని స్పష్టంచేశారు. పిరాయస్‌లో గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ (కేకేఈ) ఆధ్వర్యంలో వేలాది మంది భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ‘ప్రజల హంతకులకు నేలగానీ నీరుగానీ ఇవ్వం’ గ్రీస్‌ను అమెరికా`నాటో సైనిక స్థావరంగా మార్చనివ్వం’ అని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ర్యాలీలో కమ్యూనిస్టు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ను నిలిపివుంచిన ప్రాంతానికి దగ్గరలోని పసలిమని వరకు ర్యాలీ సాగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img