ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వంపై జెలెన్‌స్కీ
కీవ్: నాటో సభ్యత్వంపై జూలై నాటికి స్పష్టమైన ప్రకటనను కీవ్ కోరుకుంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ అన్నారు. యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో ఉక్రెయిన్ చేరికపై పురోగతిని ఆశిస్తున్నటు తెలిపారు. ఇవి తాత్సారం చేయాల్సిన అంశాలు కాబోదని అన్నారు. జూలై నెలలో మాల్డోవాలో జరగనున్న నాటో సమావేశంలో ఉక్రెయిన్ సభ్యత్వంపై సానుకూల నిర్ణయాన్ని ఆశిస్తున్నట్లు వెల్లడిరచారు. రష్యాతో యుద్ధాన్ని ముగించడానికి శాంతి సమావేశం కోసం తాము సిద్ధమని జెలెన్‌స్కీ చెప్పారు. నాటో సమావేశంలో 40 యూరోపియన్ దేశాల ప్రతినిధులు పాల్గోనున్నారు.