ఎలాన్ మస్క్ తన ప్రవర్తనతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ట్విట్టర్ ని చేజిక్కించుకున్న నాటి నుండి ఏదో ఒక వార్త..వివాదంలో మస్క్ పేరు వినిపిస్తుంది. కాగా ఆరంభం నుంచి ట్విట్టర్ లోగో కింద ఉన్న పక్షి ఇమేజ్ ను మార్చి.. డోజికాయిన్ లోగో (షిబా ఇను లోగో) అయిన కుక్క బొమ్మను ఎందుకు పెట్టినట్టు డోజికాయిన్ అనే క్రిప్టోలో ఎలాన్ మస్క్ కు పెద్ద మొత్తంలో పెట్టబడులు ఉన్నాయని, డోజికాయిన్ విలువను పెంచేందుకే ఇలా చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో చాలా మంది విమర్శలు చేస్తున్నారు. కాగా మస్క్ మూడు రోజుల తర్వాత మళ్లీ పాత పిట్టను తీసుకొచ్చి ట్విట్టర్ లోగోలో పెట్టేశారు. దీంతో కుక్క బొమ్మ కనుమరుగైంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గతేడాది డోజికాయిన్ ఇన్వెస్టర్లు ఎలాన్ మస్క్ కు వ్యతిరేకంగా 258 బిలియన్ డాలర్ల భారీ పరిహారం కోరుతూ మన్ హటన్ ఫెడరల్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. డోజికాయిన్ ధరను కృత్రిమంగా పెంచి, ఆ తర్వాత పతనానికి కారణమయ్యారన్నది ఇన్వెస్టర్ల ఆరోపణ. సరిగ్గా మూడు రోజుల క్రితం ట్విట్టర్ పిట్టను తొలగించి, దాని స్థానంలో డోజిని కూర్చోబెట్టి ఎలాన్ మస్క్ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏదో కొన్ని నిమిషాల పాటు అలా జరిగి ఉంటుందేమో అనుకోగా, మూడు రోజుల పాటు డోజికాయిన్ లోగోనే ట్విట్టర్ లో కొనసాగించారు.