Monday, June 5, 2023
Monday, June 5, 2023

డాలర్‌ ఆధిపత్యాన్ని తగ్గించాలి


జిన్‌పింగ్‌తో భేటీలో లూలా
షాంఘై: బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డ సిల్వా శుక్రవారం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. బీజింగ్‌లో ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది. ఇద్దరు నాయకులు తాజా పరిణామాలపై నిశితంగా చర్చించుకున్నారు. డాలర్‌ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు ముమ్మర చర్యలు అవశ్యమని జిన్‌పింగ్‌తో లూలా చెప్పారు. పశ్చిమ దేశాల నేతృత్వ ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యాన్ని, వాణిజ్యంసవాళ్లపై పెత్తనాన్ని తగ్గించే అంశమై చర్చించారు. ఉక్రెయిన్‌రష్యా మధ్య శాంతి ప్రక్రియపైనా ఇద్దరు చర్చించినట్లు సమాచారం. లూలూ గురువారం న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆయన అక్కడ మాట్లాడుతూ ‘రోజు రాత్రి నాకు నేనుగా ప్రశ్నించుకుంటుంటాను. సెటిల్మెంట్‌ కరెన్సీగా డాలర్‌ను మాత్రమే ఎందుకు వినియోగించాలి? సొంత కరెన్సీల ఆధారంగా వాణిజ్యాన్ని ఎందుకని కొనసాగించరాదు? అని అన్నారు. బ్రెజిల్‌ అధ్యక్షుడిగా లూలా తొలిసారి చైనాలో అధికారికంగా పర్యటించారు. లూలా పర్యటన క్రమంలో బ్రెజిల్‌ వర్షారణ్యంలో పర్యావరణ పర్యవేక్షణ మెరుగుదల కోసం ఉపగ్రహాల నిర్మాణంతో సహా 20 ద్వైపాక్షిక ఒప్పందాలు జరుగుతాయని తెలుస్తోంది. సొంత కరెన్సీలలో వాణిజ్యం చేసే విధంగా బీజింగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బ్రెజిల్‌ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. డాలర్‌ ఆధిపత్యాన్ని తగ్గించాలని ప్రతిపాదించింది. వాణిజ్యం కోసం డాలర్‌పైనే ప్రతి దేశం ఆధారపడాల్సిన అవసరం ఏమిటని బ్రెజిల్‌ ప్రశ్నించింది. బ్రెజిల్‌, చైనా లేక బ్రెజిల్‌, ఇతర బ్రిక్స్‌ దేశాల మధ్య వాణిజ్యానికి బ్రిక్స్‌ బ్యాంకు వంటి బ్యాంకు ఎందుకని ఓ కరెన్సీని పెట్టుకోకూడదని లూలా ప్రశ్నించారు. ఎగుమతుల కోసం డాలర్లపై ఆధారపడాల్సి వస్తోంది. సొంత కరెన్సీలోనే ఎగుమతులు చేసుకోవచ్చు అని ఆయనన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) మీద ఆయన అసహనం వ్యక్తంచేశారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న అర్జెంటైనా వంటి బ్రెజిల్‌ పొరుగు దేశలపై ఎక్స్ఛేంజ్‌లో బెయిలౌట్‌ రుణాల కోసం ఐఎంఎఫ్‌ ఒత్తిడి తెస్తోందని అన్నారు. ఏ బ్యాంకు కూడా ఇలా చేయకూడదన్నారు. అప్పు ఉన్నంత మాత్రాన నాయకుడి మెడపై కత్తి పెట్టి పనిచేయమనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అర్జెంటైనా విషయంలో ఐఎంఎఫ్‌ వ్యవహార తీరును లూలా తీవ్రంగా ఖండిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img