ఏథెన్స్: గ్రీస్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన థెస్సలోనికిలో గ్రీస్ కమ్యూనిస్టు పార్టీ (కేకేఈ) అధ్వర్యంలో భారీ ఎన్నికల ర్యాలీ జరిగింది. గ్రీస్‌లో త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కమ్యూనిస్టుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రదర్శన నిర్వహించారు. కేకేఈకి ఓటు వేస్తే మీ ఆశలు, ఆకాంక్షలకు, ఉజ్వల భవిష్యత్‌కు, సానుకూల పరిస్థితులకు ఓటు వేసినట్లే అని నాయకులు ఉద్ఘాటించారు. అందరం కలిసిమెలిసి మార్పు తేగలమని పిలుపునిచ్చారు. ప్రజలకు సాధికారతను మరింతగా చేకూర్చగలిగినది ఓటు ఒక్కటేనని, ఓటు హక్కును సద్వినియోగించుకోవాలని దేశ ప్రజలకు సూచించారు. సుత్తి`కొడవలి గుర్తుకు ఓటేయాలని, అది ఆశలు, ఆకాంక్షలు, నిజాయితీ, గౌరవానికి ప్రతీక అని నేతలు పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు నిర్వహించిన అతిపెద్ద ర్యాలీలో వేలాది సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీకి మద్దతు తెలిపారు. ఆర్థిక సుస్థిరత, పెట్టుబడి లక్ష్యాల దిశగా ముందుకెళ్లడం కేకేఈకి ఓటు వేయడం ద్వారానే సాధ్యమని నాయకులు వెల్లడిరచారు.