Sunday, August 14, 2022
Sunday, August 14, 2022

దక్షిణాఫ్రికాలో అమానుషం

ఎనిమిది మంది మోడల్స్‌పై సామూహిక అత్యాచారం
మ్యూజిక్‌ వీడియో షూట్‌ సమయంలో లైంగిక దాడి
దోషులను తక్షణమే అరెస్టు చేయాలి : అధ్యక్షుడి ఆదేశం

జోహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికాలో అమానుషం చోటుచేసుకుంది. జోహన్సెస్‌బర్గ్‌ సమీపంలో మ్యూజిక్‌ వీడియో షూటింగ్‌ క్రమంలో ఎనిమిది మంది మోడల్స్‌పై సామూహిక అత్యాచారం జరిగింది. జోహన్నెస్‌బర్గ్‌కు పశ్చిమాన ఉన్న చిన్న పట్టణమైన క్రుగర్స్‌డోర్ప్‌ శివార్లలో గురువారం జరిగిన దాడిపై ఇప్పటివరకు 20 మంది అనుమానితుల్లో ముగ్గురిని భద్రతా బలగాలు అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి భేకీ సెలే ఆదివారం తెలిపారు. షూటింగ్‌ కోసం సెట్‌ను సిద్ధం చేసే సమయంలో మోడల్స్‌పై లైంగిక దాడి జరిగింది. బాధితులు 18`35మధ్య వయస్సుగల వారు. వీరిలో ఒకరిపై ఏకంగా పది మంది అత్యాచారానికి పాల్పడగా మరొకరిపై ఎనిమిది మంది దాడి చేశారని సెలే వెల్లడిరచారు. పురుషులను సైతం వివస్త్రలను చేసి నిలువునా దోచుకున్నారన్నారు. దక్షిణాఫ్రికాలో ప్రతి 12 నిమిషాలకు సగటున ఒక మహిళపై అత్యాచారం జరుగుతుందని పోలీసు నివేదికలు చెబుతున్నాయి. తాజా ఘటనపై అధ్యక్షుడు సిరిల్‌రామాపోసా స్పందించారు. దోషులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img