ఐరాస: గాంబియా, ఇండోనేసియా, ఉజ్బెకిస్తాన్ దేశాల్లో ఐదేళ్లలోపు 300 మందికిపైగా చిన్నారులు 2022లో దగ్గు మందుల కారణంగా ప్రాణాలు కోల్పోవ డంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ఓ) తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తంచేసింది. కల్తీ ఔషధాల నుంచి పిల్లలను కాపాడాలని నొక్కి చెప్పింది. తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చింది. కత్తీ మందులు తీసుకోవడం వల్ల మూత్రపిండాల పనిచేయక పసిపిల్లలు ప్రాణాలు కోల్పోయినట్లు డబ్ల్యూహెచ్ఓ తాజా ప్రకటన పేర్కొంది. మందు దుకాణాల్లో లభించే దగ్గు మందుల్లో డిథనైల్ గ్లోకోల్, ఇథైలీన్ గ్లైకాల్ వంటి విషపదార్థాలు అధిక మోతాదుల్లో ఉంటున్నట్లు గుర్తించింది. పరిశ్రమల్లో వినియోగించే రసాయ నాలు ప్రాణాంతకమని, వాటి మోతాదు మందుల్లో చాలా తక్కువగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఏడు దేశాల్లో కత్తీ సిరప్‌ల గురించి నాలుగు నెలల్లో అనేక ఫిర్యాదులు వచ్చిన క్రమంలో 194 సభ్యదేశాల్లో మరిన్ని మరణాలు సంభవిం చకుండా తక్షణమే జాగ్రత్తలు చర్యలు చేపట్టాలని అన్ని దేశాలకు ఆరోగ్య సంస్థ స్పష్టంచేసింది. చిన్నారుల మరణాలను నిరోధించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొంది. నాసిరకం మందులు నియంత్రించేందుకు తనిఖీలు ప్రారంభించాలని సంబంధిత దేశాలకు పిలుపునిచ్చింది. ఇండోనేసియాకు చెందిన పీటీ యరిందో ఫార్మాటమా, పీటీ యూనివర్సల్ ఫార్మాస్యూటికల్, పీటీ కోనిమెక్స్, పీటీ ఏఎఫ్ఐ ఫార్మా కంపెనీలకూ గతేడాదిలోనే దగ్గు మందుల తయారీకి సంబంధించి హెచ్చరికలను డబ్ల్యూహెచ్ఓ జారీచేసింది. కల్తీ మందులు తయారు చేయమని ఆయా కంపెనీలు వాదించిన క్రమంలో విచారణ ప్రక్రియ ప్రస్తుతానికి కొనసాగుతున్న విషయం విదితమే.