Friday, June 9, 2023
Friday, June 9, 2023

నేరాభియోగాలు రుజువైతే ట్రంప్‌కు 136 ఏళ్ల జైలు

న్యూయార్క్‌: పోర్న్‌స్టార్‌కు చెల్లింపుల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అరెస్టయ్యారు. మంగళవారం న్యూయార్క్‌లోని మన్‌హట్టన్‌ కోర్టుకు హాజరైన ట్రంప్‌ ముందుగా డిస్ట్రిక్ట్‌ అటార్నీ కార్యాలయంలో లొంగిపోయారు. దీంతో ట్రంప్‌ను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నట్టు కోర్టు పరిగణించింది. విచారణ అనంతరం కోర్టు ఆయనను కస్టడీ నుంచి విడుదల చేసింది. డిసెంబర్‌ 4న మరోసారి ఆయనను కోర్టు విచారించనుంది. హష్‌ మనీతోపాటు మొత్తంగా ట్రంప్‌పై 34 నేర అభియోగాలు నమోదయ్యాయి. ఇవిగనక రుజువై ట్రంప్‌ దోషిగా తేలితే… దాదాపు 136 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఒకవేళ ట్రంప్‌ దోషిగా తేలినా.. అంత శిక్ష వేయకపోవచ్చు అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
మన దేశం నాశనం అవుతోంది: ట్రంప్‌
తనపై క్రిమినల్‌ అభియోగాలు మోపడం అమెరికాకే అవమానమని ట్రంప్‌ పేర్కొన్నారు. కోర్టు నుంచి వెళ్లిన తర్వాత ఫ్లోరిడాలోని తన నివాసం వద్ద మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్‌ మాట్లాడుతూ… మన దేశం నాశనం అవుతోంది… నరకానికి వెళ్తోందంటూ బైడెన్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అఫ్గానిస్థాన్‌ నుంచి మన బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత ప్రపంచం మనల్ని చూసి నవ్వుతోందని విమర్శించారు. మనం మన దేశాన్ని రక్షించుకోవాలి. అమెరికాలో ఇలాంటివి జరుగుతాయని తానెప్పుడూ అనుకోలేదన్నారు. ఇది దేశానికి అవమానం అని చెప్పారు. దేశాన్ని నాశనం చేయాలనుకునేవారి నుంచి రక్షించేందుకు ప్రయత్నించడమే తాను చేసిన నేరమని వెల్లడిరచారు. తనపై ఈ తప్పుడు కేసు పెట్టారని, వెంటనే దానిని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.
అసలు కేసు ఏంటంటే?
ట్రంప్‌తో తనకు శారీరక బంధం ఉందని, 2006లో ఓ హోటల్‌లో తామిద్దరం ఏకాంతంగా కలిశామని పోర్న్‌స్టార్‌ స్టార్మీ ఆరోపిస్తున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ విషయాన్ని బయటపెట్టకుండా తనతో ట్రంప్‌ ఒప్పందం చేసుకొని డబ్బును చెల్లించారన్నారు. ఈ చెల్లింపులను వ్యాపార ఖర్చుగా చూపించారు. ఇలా బిజినెస్‌ రికార్డులను తప్పుగా చూపించడమే ఇప్పుడు ట్రంప్‌పై అభియోగం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img