Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023

పంజ్‌షేర్‌ లొంగదు…

600 మంది తాలిబన్లు హతం.. వెయ్యిమంది లొంగుబాటు
ప్రటిఘటన దళం ప్రకటన

పంజ్‌షీర్‌ / కాబూల్‌ : అఫ్గాన్‌ తమ వశమైనట్లు తాలిబన్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఆ దేశంలో ఆధిపత్య పోరు నెలకొంది. ఈ పరిస్థితి ప్రతిఘటన దళాలు, తాలిబన్ల మధ్య అంతర్యుద్ధానికి దారితీసింది. పంజ్‌షీర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తాలిబన్లు చేసిన ప్రకటనను పంజ్‌షీర్‌ తిరుగుబాటు దళం తీవ్రంగా ఖండిరచింది. తాలిబన్లతో యుద్ధం కొనసాగుతున్నదని పేర్కొంది. పంజ్‌షీర్‌ ఇంకా వారికి లొంగిపోలేదని తెలిపింది. ఇప్పటికే 600 మందికిపైగా తాలిబన్లను మట్టుబెట్టినట్టు ప్రకటించింది. వెయ్యి మందికిపైగా తాలిబన్లు తమకు లొంగిపోయారని వెల్లడిరచింది. ఈ మేరకు పంజ్‌షీర్‌ తిరుగుబాటు దళ ప్రతినిధి ఫహీం దష్టి ప్రకటించిన్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. పంజ్‌షీర్‌పై ఆధిపత్యం సాధించామని తాలిబన్లు ప్రకటించిన మరునాడే ఆరు వందల మంది తాలిబన్లను మట్టుబెట్టినట్లు పంజ్‌షీర్‌ దళం చేసిన ప్రకటనలతో అంతటా గందరగోళం నెలకొంది. వాస్తవ పరిస్థితి ఏమిటనే చర్చ మొదలైంది. మరోవైపు ఏళ్ల తరబడిగా కొరకరాని కొయ్యిగా ఉన్న పంజ్‌షీర్‌ తమ వశమైనట్లు తాలిబన్లు ప్రకటించుకున్నారు. దీంతో యావత్‌ దేశాన్ని వారు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పుకున్నారు. అఫ్గాన్‌ మాదంటూ విర్రవీగారు. అఫ్గాన్‌ ఆపద్ధర్మ అధ్యక్షుడు అమ్రుల్లా సాలెప్‌ా మాత్రం దేశం వీడినట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ వాటిని అమ్రుల్లా సాహెప్‌ా ఖండిరచారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తాలిబన్లుకు లొంగబోనని ప్రకటించారు. ఒక వేళ తనకు తీవ్రంగా గాయపడితే తలపై తుపాకి పెట్టి రెండు సార్లు కాల్చాలని బాడీగార్డును ఆదేశించినట్లు వెల్లడిరచారు. దేశం విడిచారన్న ఆరోపణలను అమ్రుల్లా సాలెప్‌ా కొట్టిపారేశారు. తాను పంజ్‌షీర్‌లోనే ఉన్నట్లు బీబీసీకి తెలిపారు. తన బేస్‌పాయింట్‌ నుంచే మాట్లాడుతున్నట్లు వారికి పంపిన వీడియోలో తెలిపారు. తమ కమాండర్లు, రాజకీయ నేతలతో ఉన్నట్లు వెల్లడిరచారు. తాలిబన్‌ దండయాత్రతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామనడంలో సందేహం లేదుగానీ వెన్నుచూపబోమని కచ్చితంగా చెప్పారు. తాలిబన్లు యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారని, దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించాలన్నారు. మరోవైపు అఫ్గాన్‌ తమదే అంటూ తాలిబన్లు సంబరాలు జరుపుకుంటూ జరిపిన కాల్పుల్లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 41 మంది వరకు గాయపడ్డారని టోలో వార్తాసంస్థ పేర్కొంది.
వచ్చే వారంలో ప్రభుత్వ ఏర్పాటు !
అఫ్గాన్‌లో తాలిబన్‌ ప్రభుత్వ ఏర్పాటు విషయమై తర్జనభర్జన కొనసాగుతోంది. మల్లగుల్లాల నడుమ కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రకటన మూడవసారి వాయిదా పడిరది. ఈ మేరకు తాలిబన్‌ అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్‌ ప్రకటించారు. కొత్త ప్రభుత్వం, కే బినెట్‌ సభ్యుల వివరాలపై ప్రకటన వచ్చే వారంలో ఉండవచ్చునని వెల్లడిరచారు. అంతర్జాతీయ సమాజం ఆమోదించే తరహా నాయకత్వాన్ని ఇవ్వడంలో తాలిబన్లు ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వానికి తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ నేతృత్వం వహిస్తారని, దీనిపై శనివారం ప్రకటన వస్తుందని అంతా భావించారుగానీ మరో వాయిదాతో తాలిబన్ల మధ్య అంతర్గతంగా విబేధాలు ఉన్నాయన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుపై వివిధ వర్గాలతో చర్చించేందుకు ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యుడిగా ఉన్న ఖలీల్‌ హక్కానీ స్పందించారు. అంతర్జాతీయ సమాజం ఆమోదించేలా విస్తృత ప్రభుత్వర ఏర్పాటు కోసం తాలిబన్లు యత్నిస్తుండటంతో జాప్యం జరుగుతోందని అన్నారు. ‘తాలిబన్లు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలరు. వారి పరిపాలనా విభాగంలో అన్ని పార్టీలు, వర్గాలు, సమాజంలోని పలువురికి సముచిత స్థానం కల్పించాలని వారు భావిస్తున్నారు. తాలిబన్ల ప్రభుత్వాన్ని ప్రపంచం ఆమోదించకపోవచ్చు.. అయితే ప్రభుత్వానికి మద్దతును కూడగట్టేందుకు ఇతర భాగస్వామ్య సంఘాలతోనూ చర్చలు జరుగుతున్నారన్నారు. మరోవైపు, పాక్‌లో పర్యటిస్తున్న బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డొమినిక్‌ రాబ్‌తో శనివారం సమావేశమైన పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ జావేద్‌ బజ్వా.. అఫ్గాన్‌లో తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని స్పష్టం చేశారు. అఫ్గన్‌లో శాంతి, స్థిరత్వానికి పాకిస్థాన్‌ పోరాటం చేస్తుందని, అన్ని వర్గాలను సమన్వయం చేసే ప్రభుత్వం ఏర్పాటుకు సహకరిస్తోందని అన్నారు. తాలిబన్లకు వ్యతిరేకంగా అఫ్గాన్‌లో ప్రజాపోరాటం జరుగుతోంది. ఈ క్రమంలో కాబూల్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్య, ఉద్యోగ తదితర రంగాల్లో హక్కుల సాధనతోపాటు దేశంలో కొత్తగా కొలువుదీరనున్న తాలిబన్ల ప్రభుత్వంలో తమకూ భాగస్వామ్యం కల్పించాలని అఫ్గాన్‌ మహిళలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. స్వేచ్ఛ, హక్కులను కాలరాయొద్దంటూ నినదించారు. మహిళలంతా ప్రదర్శనగా అధ్యక్షుడి భవనం వైపుకు కదం తొక్కగా అడ్డుకున్న తాలిబన్లు నిరసనకారులపై బాష్పవాయువును, పెప్పర్‌ స్ప్రేను ప్రయోగించారు. ర్యాలీని అడ్డుకున్న తీరును చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టగా అవి వైరల్‌ అయ్యాయి. వీడియోలు పోస్టు చేసిన మహిళ తలకు గాయమై, నెత్తురోడుతున్నట్లు కనిపిస్తోంది. శాంతియుతంగా మహిళలను నిరసన తెలుపుతున్నా.. తాలిబన్లు ఆవేశంతో రెచ్చిపోయి ఆ వీడియోల్లో కనిపించింది. అఫ్గాన్‌.. తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో కాబుల్‌, హెరాత్‌లలో తమ హక్కుల కోసం మహిళలు గొంతెత్తుతున్నారు. నిరసనలు చేపడుతున్నారు. ఉద్యోగ హక్కు, ప్రభుత్వంలో భాగస్వామ్యాన్ని డిమాండు చేస్తున్నారు. మహిళలను తుపాకులతో తలపై కొట్టి రక్తపాతాన్ని తాలిబన్లు సృష్టించినట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థతో వారు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img