లండన్: 1948లో ఉద్భవించిన నక్బా డే సందర్భంగా లండన్, మాంచెస్టర్ నగరాల్లో పలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులకు వ్యతిరేకంగా ప్రజలు భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ ర్యాలీలో అన్ని రంగాలకు చెందిన పురుషులు, మహిళలు, చిన్నారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పలస్తీనాకు సంఫీుభావంగా నినదించారు. తాజాగా పలస్తీనాపై ఇజ్రాయిల్ వరుస దాడులను, ఆక్రమణలను, దౌర్జన్యాన్ని ఖండిరచారు. పలస్తీనా ప్రజల్ని ఇజ్రాయిల్ శాశ్వతంగా వారి భూభాగాల నుంచి తరిమేసిన 1948లో జరిగిన ఘాతుకానికి వ్యతిరేకంగా నినదించారు. 1948లో పలస్తీనా ప్రజల్ని వారి మాతృభూమి నుండి తరిమేసి ఇజ్రాయిల్ ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ కొనసాగుతోంది. నక్బా 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని లండన్‌లోని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు పలస్తీనాకు తమ సంఫీుభావం ప్రకటించారు. ఇజ్రాయిల్ అప్పట్లోనే 750,000 మంది పాలస్తీనియన్లు తరిమివేసి వారి ఆవాసాలను ఆక్రమించారు. ఈ సందర్బంగా ఇజ్రాయిల్ మొదటి ప్రధాన మంత్రి డేవిడ్ బెన్-గురియన్‌ను ఉటంకిస్తూ – బహిష్కరణకు గురైన పలస్తీనియన్ల గురించి ‘‘వృద్ధులు చనిపోతారు, యువకులు మరచిపోతారని వ్యాఖ్యానించడాన్ని జర్మనీకి చెందిన లిండ్సే తీవ్రంగా ఖండిరచారు. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని నిలువరించాలి. యువత ఈ ఘాతుకాన్ని ఎప్పటికీ మరచిపోలేదు. మేము నక్బా సంఘటనను 75 సంవత్సరాలనుండి ప్రతిఘటిస్తూనే ఉన్నామని అన్నారు. అయితే పలస్తీనా పరిస్థితి మరింత దిగజారుతోంది. కొన్ని దేశాలు పలస్తీనాపై ఇజ్రాయిల్ అక్రమ ఆక్రమణకు మద్దతు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. లేబర్‌కు పార్టీకి చెందిన జాన్ మెక్‌డొనెల్, జెరెమీ కార్బిన్, యూనియన్ల నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పలస్తీనాకు సంఫీుభావంగా ప్రకటనలు చేశారు. మాంచెస్టర్‌లోని 14 ప్రచార సంస్థలు ఏకమై పలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులను ప్రతిఘటించే ర్యాలీలో పాల్గొన్నాయి.