Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

పలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడులు ఆగాలి

రాజకీయ ఖైదీలను తక్షణమే విడుదల చేయాలి
గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ డిమాండ్‌

గ్రీస్‌: ఏటా ఏప్రిల్‌ 17వ తేదీని ఇజ్రాయిల్‌లో పలస్తీనా రాజకీయ ఖైదీల దినోత్సవంగా పాటిస్తారు. ఈ సంవత్సరం రాజకీయ ఖైదీల దినోత్సవం నాటికి పలస్తీనాపై ఇజ్రాయిల్‌ విరుచుకుపడటం యాధృచ్ఛికం. తాజా పరిణామాలు మరింత ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ (కేకేఈ) కేంద్ర కమిటీ అంతర్జాతీయ సంబంధాల విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది. పలస్తీనా ప్రజలకు సంఫీుభావాన్ని ప్రకటించింది. ఇజ్రాయిల్‌ జైళ్లల్లో వేలాది మంది పలస్తీనా ఖైదీలు మగ్గుతున్నారని ఆందోళన వ్యక్తంచేసింది. అమెరికా, ఈయూ, నాటో తదితర శక్తుల మద్దతుతో పలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడులు చేస్తోందని, దశాబ్దాలుగా ఇది కొనసాగిస్తూ పౌరహత్యలకు పాల్పడుతోందని పేర్కొంది. పలస్తీనా ప్రజలను దీర్ఘకాలం నిర్బంధానికి గురిచేస్తూ వారితో అమానవీయంగా ప్రవర్తిస్తోందని ఇజ్రాయిల్‌ తీరును గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిరచింది.
ఇజ్రాయిల్‌ జైళ్లలో ఉన్న పలస్తీనా రాజకీయ ఖైదీల సంఖ్య 4,900కుపైగా ఉన్నదని, వీరిలో పిల్లలు (160 మంది), 30 మంది మహిళలు, నలుగురు పార్లమెంటేరియన్లు, 1,016 ఖైదీలు ఉన్నారని, విచారణ లేకుండా బంధీగా ఉన్నారని కేకేఈ ఆవేదన వ్యక్తంచేసింది. పలస్తీనాపై ఇజ్రాయిల్‌ యుద్ధనేరాలను నిరసించాలని, పలస్తీనా ప్రజలకు మరింతగా మద్దతు, సంఫీుభావం తెలుపాలని గ్రీస్‌ ప్రజలకు కమ్యూనిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఇజ్రాయిల్‌ దండయాత్రకు చరమగీతం పాడేందుకు మరింత ఉధృత పోరు అవసరమని నొక్కిచెప్పింది.
నిర్బంధంలో ఉన్న పలస్తీనా ప్రజలు, ఇజ్రాయిల్‌ జైళ్లల్లో మగ్గుతున్న రాజకీయ ఖైదీలను తక్షణమే విడుదల చేయాలని, తూర్పు జెరూసలేం రాజధానిగా, 1967 నాటి సరిహద్దులు ప్రామాణికంగా స్వతంత్ర పలస్తీనా ఏర్పాటు కావాలని, పలస్తీనా శరణార్థులందరికీ తమ స్వస్థలానికి, ఇళ్లకు తిరిగి వచ్చే హక్కు ఉన్నదని గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img