Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

పుతిన్‌ బర్త్‌ డే.. బెలారస్‌ అధ్యక్షుడు స్పెషల్‌ గిఫ్ట్‌..!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పుతిన్‌ తన పుట్టినరోజును ఎలాంటి ఆడంబరం, హంగామా లేకుండా సాదాసీదాగా జరుపుకున్నారు. ఉక్రెయిన్‌లో ఎదురుదెబ్బలు, ఆ దేశంపై సైనిక చర్యపై స్వదేశంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న పుతిన్‌కు ఉత్సాహం కలిగించేలా బెలారస్‌ అధ్యక్షుడు, సన్నిహిత మిత్రుడు అలెగ్జాండర్‌ లుకాషెంకో పుట్టినరోజు బహుమతిగా ట్రాక్టర్‌ను అందించారు. ట్రాక్టర్‌తో పాటు, పుతిన్‌కు మిత్రదేశాలు, స్నేహపూర్వక రాష్ట్రాల అధినేతల నుండి విలాసవంతమైన బహుమతులు లభించాయి. తజకిస్థాన్‌ ప్రెసిడెంట్‌ ఎమోమాలి రెహ్మాన్‌.. పుతిన్‌కు పుచ్చకాయల పిరమిడ్‌ను బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img