Friday, February 3, 2023
Friday, February 3, 2023

పేలుళ్లు మా పనే

ఐసిస్‌`కే ప్రకటన
103కు చేరిన మృతుల సంఖ్య
మా భవితవ్యం అంధకారం : చిన్నారుల ఆవేదన
మరిన్ని దాడులకు అవకాశం : అమెరికా హెచ్చరిక

కాబూల్‌ : అఫ్గాన్‌ రాజధాని కాబూల్‌లోని హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం రక్తసిక్తంగా మారింది. భీతా వహ దృశ్యాలతో నిండిపోయింది. శరీర భాగాలు తునాతున కులుగా ఎగిరిపడ్డాయి. అమెరికా భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని ఐసిస్‌ ఖోరసాన్‌(కె) సంస్థ చేపట్టిన ఆత్మాహుతి బాంబు దాడుల్లో 103 మందికిపైగా మరణించారు. వీనిలో 90 మంది అఫ్గాన్‌ వాసులు మృతి చెందగా 13 మంది అమెరికా సైనికులు మరణించారు. గాయపడిన వారి సంఖ్య 150కి చేరింది. క్షతగాత్రుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాబూల్‌ లోని అమెరికా సైనికులను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులు చేసినట్లు ఐసిస్‌్‌ స్పష్టం చేసింది. ఈ దాడికి బాధ్యత తమదేనని వెల్లడిర చింది. వరుస బాంబు దాడులతో అట్టుడికిన కాబూల్‌ విమానాశ్రయంలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కదుటబడుతు న్నాయి. బాంబు దాడులతో నిలిచిపోయిన తరలింపుల ప్రక్రి యను వివిధ దేశాలు పునరు ద్ధరిస్తున్నాయి. విదేశీ విమా నాలు ల్యాండ్‌ అవుతున్నాయి. మరికొన్ని దేశాలు మాత్రం తరలింపులకు బ్రేక్‌ వేశాయి. డెడెలైన్‌ ముగింపులోపు కాబూల్‌ విమానాశ్రయంలో మరిన్ని దాడులు జరగవచ్చునని అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. కాబూల్‌ నుంచి తమ ప్రజల తరలింపుల ప్రక్రియ ముగిసిందని స్పెయిన్‌ ప్రకటించింది.
ఖండిరచిన తాలిబన్‌
కాబూల్‌లో గురువారం జరిగిన జంట పేలుళ్ల ఘటనను తాలిబన్లు ఖండిరచారు. ఇటువంటి ఘటనలను తాము అంగీకరించమన్నారు. ఈ పేలుళ్లకు ఐఎస్‌ ఉగ్రవాదులే కారణమని తాలిబన్‌ అధికార ప్రతినిధి జుబిముల్లా ముజహిద్‌ పేర్కొన్నారు. నిందితులను చట్టం ముందు నిలబెడతామని తాలిబన్‌ అధికార ప్రతినిధి సుహిల్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.
పేలుళ్లకు మాదే బాధ్యత ఐఎస్‌ఎస్‌కె అఫ్గాన్‌లో జరిగిన పేలుళ్లకు తామే బాధ్యులమని ఐఎస్‌ఐఎస్‌కె (ఖొరోసన్‌) శుక్రవారం ప్రకటించింది. అబే గేటు వద్ద జరిగని పేలుడుకు సంబంధించి ఆత్మాహుతి బాంబర్‌ ఫొటోను విడుదల చేసింది.ఈ సంస్థ తూర్పు అఫ్గాన్‌లో నంగాహర్‌, కునార్‌ ప్రావిన్స్‌లలో తమ ఉనికిని ఏర్పరచుకుంది. 2016 నుంచి అఫ్గాన్‌ రాజ ధానిలో వెలుపల ఆత్మాహుతి దాడులను నిర్వహిం చింది. కాబూల్‌లో సెల్‌ ఏర్పాటు చేసింది.
ప్రతీకారం తీర్చుకుంటాం : బైడెన్‌
కాబూల్‌ విమానాశ్రయంపై జరిగిన పేలు ళ్లపై జరిగిన నష్టానికి తానే బాధ్యతగా ప్రకటిం చుకున్న బైడెన్‌ సైన్యం తరలింపు ఆలస్యానికి తమ నిర్ణయాలే కారణమన్నారు. తమ సైనికుల ప్రాణాలు తీసినవారిని వదిలిపెట్టబోమని ..ప్రతీకారం తీర్చుకుంటా మని హెచ్చరించారు. దాడికి పాల్పడినట్లు ఐసిస్‌ ప్రకటించిన నేపధ్యంలో ఆ ఉగ్రవాద సంస్థ నాయకులను హతమార్చా లని తమ దేశ ఆర్మీని బైడెన్‌ ఆదేశించారు. గురువారం వైట్‌హౌస్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ఈ దాడిని అంత తేలికగా మరచిపోం.. వెంటాడి వేటాడి ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. అయితే అధ్యక్షుడి నిర్ణయాలపై రిపబ్లికను ్లతీవ్రంగా విరుచకుపడ్డారు. బైడెన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కాబూల్‌ విమానాశ్రయంపై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా సెం ట్రల్‌ కమాండ్‌ జనరల్‌ వెల్లడిరచారు. ఈసారి రాకెట్లు, వాహన బాంబులతో దాడులు జరిగే అవకాశం ఉందని తెలిపింది. రెండు దశాబ్దాలపాటు జరిగిన అఫ్గాన్‌ యుద్ధంలో 1909 మంది అమెరికా సైనికులు మరణించారు.
నరమేథం నుంచి బైటపట్ట 160 మంది
సుమారు 160 మంది మైనారిటీలు బుధ వారం సాయంత్రం కాబూల్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరు ఆ దేశం వీడి బైటకు వెళ్లాలన్నది వీరి ఉద్దేశం. వీళ్లల్లో 145 మంది సిక్కులు, 15 మంది హిందువులు ఉన్నారు. తాలిబన్లు అడ్డుకోవడంతో సరైన పేపర్లు ఉన్న తమను అడుకున్నారని ధర్నాకు దిగారు. తాలిబన్లు అనుమతించకపోవడంతో వెనుది రిగిన కొద్ది సేపులోనే (అబే గేట్‌) వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటన తలచుకుంటేనే భయంగా ఉందని కాబూల్‌ గురుద్వారా కమిటీ అధ్యక్షడు గుర్మాన్‌ సింగ్‌ తెలిపారు. ప్రస్తుతం వీరందరూ ఈ గురుద్వారాలోనే తలదాచుకున్నారు.
దిల్లోలో అఫ్గాన్ల ఆందోళన
దిల్లీలోని శరణార్థుల కార్యాలయంలో ఉంటున్న అఫ్గాన్లు ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజన్సీ హై కమిషనర్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళ నలో అఫ్గాన్‌లో ఉన్న తమ సోదరీమణులను ఆదుకోవాలని దియా దియానా అనే చిన్నారులు నినదించారు. తమ దేశంలో ఉన్న పిల్లలు , మహిళలు ఎంతటి అభద్రతకు గురవుతున్నారో తమకు తెలుసునని, అఫ్గాన్‌ శరణార్థులను ఇతర దేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని వీరు విజ్ఞప్తి చేశారు. భారత్‌లో తమకు మెరుగైన అవకాశాలు కల్పిం చాలని కోరారు. తమ భవిష్యత్తు అంధకారంగాఉందని, అఫ్గాన్‌లోని పిల్లలను అభద్రతా భావం నుంచి కాపాడాలని దీక్షలో కూర్చున్న జులేఖా(10) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ‘ఆపరేషన్‌ దేవిశక్తి’ కింద 35 మందిని గురువారం దిల్లీకి తరలించారు. వీరిలో 24 మంది భారతీయలు, 11 మంది నేపాలీలు ఉన్నారు.
మొత్తం ఆఫ్గాన్‌కోసం పోరాడుతాం
పంజ్‌షీర్‌ ప్రాంతాన్నే కాకుండా మొత్తం దేశాన్ని తాలిబన్లపాలన నుంచి కాపాడతామని అహ్మద్‌ మసూర్‌ అధికార ప్రతినిధి వెల్లడిరచారు. అఫ్గాన్‌ప్రజల హక్కులు, మహిళల భద్రత, మైనారిటీల రక్షణకోసం ఆందోళన చెందు తున్నామని ఫహీమ్‌ తెలిపారు. 1996`2001 ప్రాంతంలో తాలిబన్ల పాలనపై వీరు పోరాటం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img