Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి చైనా తోడ్పాటు

బీజింగ్‌: అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్కెట్‌ ఆధారిత, చట్ట ఆధారిత వ్యాపార వాతావరణాన్ని సృష్టిస్తామని చైనా ప్రధాని లీ కెకియాంగ్‌ స్పష్టం చేశారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ మంగళవారం నిర్వహించిన గ్లోబల్‌ బిజినెస్‌ నాయకులతో వర్చువల్‌గా కెకియాంగ్‌ 40 దేశాలకు చెందిన 400 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. కష్టాలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడం ద్వారా సమగ్రత, సంఫీుభావం, సమన్వయంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం పలుకుతున్నామన్నారు. ఈ సందర్భంగా కెకియాంగ్‌ మాట్లాడుతూ బహుళ స్థాయి అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడం, వివిధ మార్కెట్‌లను విస్తరించడం, ఎంటీటీలు సమానంగా, చట్ట ప్రకారం మేథో సంపత్తి హక్కులను రక్షించడం తమ ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. చైనా ప్రపంచంలోనే అత్యంత పెద్ద మార్కెట్‌గానే కాక, పెట్టుబడులకు గమ్యస్థానంగా కెకియాంగ్‌ పేర్కొన్నారు. చైనాలో పెట్టుబడులకు, వ్యాపారానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలను స్వాగతిస్తున్నట్లు లి పేర్కొన్నారు. చైనా సంస్కరణలు, ఆధునీకరణ డ్రైవ్‌కు విదేశీ సంస్థల మద్దతును అభినందిం చారు. చైనా మార్కెట్‌ సంస్థలు 150 మిలియన్లకు చేరుకు న్నాయి, 700 మిలియన్లకు పైగా ఉద్యోగాలను సృష్టిం చాయి, అందుకే చైనా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్నారు. పాలసీలను రూపొందించేటప్పుడు మార్కెట్‌ సంస్థల అవసరాలను పరిగణనలోకి తీసుకుంటానని, పన్నుల తగ్గింపు చర్యలను అమలు చేస్తానని, మార్కెట్‌ సంస్థలకు – ముఖ్యంగా పెద్ద సంఖ్యలో చిన్న, మధ్య, సూక్ష్మ వ్యాపారులకు సహాయం చేస్తానని లి హామీ ఇచ్చారు. ఇంధన సరఫరా సమస్యపై ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఇటీవలి విద్యుత్‌, బొగ్గు కొరతను పరిష్కరించడానికి, తగిన చర్యలు తీసుకున్నామన్నారు. తక్కువ-కార్బన్‌ విడుదలను ప్రోత్సహిస్తామని లి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img