ప్రపంచ ప్రజల ఐక్యతకు మేనిఫెస్టో
బెలారస్ రాజధాని మిన్క్స్ నగరంలో అంతర్జాతీయ ఫాసిస్టు వ్యతిరేక ఫోరంలో ఆసియా, అమెరికా, యూరప్ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. యుద్ధం వద్దు! నయా ఫాసిజం అణచివేతను వ్యతిరేకించండి. వారు విడుదల చేసిన మేనిఫెస్టోలో ఈ కింది అంశాలు ఉన్నాయి.
బెలారస్ గడ్డపై మేము సమావేశమవుతున్నాం. నాజీ దురాక్రమణకు బెలారస్‌లో ప్రతి ముగ్గురిలోనూ ఒకరు చనిపోవడమో, క్రూరహింసకు బలవడమో జరిగింది. కేపిటలిజం సంక్షోభం నుంచి నాజీయిజం తలెత్తింది. తమ స్వార్థపూరిత ప్రయోజనాలకు సామ్రాజ్యవాదులు ఆ చీకటి శక్తులను బలపరిచారు. హిట్లర్, ముస్సోలిని, ఫ్రాంకో తదితరులు అధికారంలోకి వచ్చారు. కోట్లాది ప్రజల భవిష్యత్‌ను వారి చేతుల్లో పెట్టారు.
ఫాసిజం పోరాటంలో గడిరచిన అనుభవాలను ప్రజలు ఎన్నటికీ మరువలేరు. 1936లో స్పెయిన్‌లో అంతర్యుద్ధం జరిగింది. దానికి నాజీ జర్మనీ, ఫాసిస్టు ఇటలీ పూర్తి మద్దతిచ్చాయి. సోవియట్ యూనియన్ ఇతర ప్రగతిశీల శక్తులు… రిపబ్లిక్ శక్తులకు సహాయాన్ని అందజేశాయి. కానీ ఫాసిజం బలమైన శక్తిగా ఆవిర్భవించింది. మానవజాతి చరిత్రలో ఇది భయంకరమైన యుద్ధం. బుహాన్ వాల్డ్, ఆస్విట్జ్, డచ్వో మృత్యుశిబిరాలుగా మారాయి.
ఫాసిజాన్ని ఓడిరచేందుకు ప్రపంచ ప్రజలు భారీ మూల్యాన్ని చెల్లించారు. సోవియట్ రెడ్‌ఆర్మీ, చైనా ప్రజా విముక్తి సైన్యం, ఫ్రెంచ్‌ఇటాలియన్ ప్రతిఘటనా శక్తులు, యుగస్లోవియా
కొరియా పార్టిజాన్లు, పోలిష్‌చెకోస్లోవేకియా దేశభక్తులు అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి ఫాసిజం వ్యతిరేక పోరాటాల్లో పాల్గొన్నారు. 1945 మే నెల్లో జర్మన్ పార్లమెంట్ భవనం రీచ్‌స్టాగ్‌పై ఎర్రజెండా ఎగురవేశారు. గత శతాబ్దం 30వ దశకంలో ఈ కార్చిచ్చు వ్యాపించింది. నేటి పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉన్నది. ఆఫ్రికా
అమెరికా ఖండాలలో నయా వలసవాదం తలెత్తింది. ఆసియాలో సామ్రాజ్యవాదులు ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారు. యూరప్, ఇతర ప్రాంతాల్లోనూ మంటలు చెలరేగుతున్నాయి.రక్తం ప్రవహిస్తోంది. ప్రజల వ్యతలు వర్ణనాతీతంగా మారాయి. మన కళ్లెదుటే ఘోరాలు జరిగిపోతున్నాయి. తల్లుల కన్నీళ్లు కలచివేస్తున్నాయి.
ఫాసిజాన్ని ఓడిరచిన సోవియట్ యూనియన్ నేడు విధ్వంసానికి గురైంది. ప్రపంచ దోపిడీదారుల పధకాలు ఫలించాయి. నియంతృత్వాన్ని రుద్దారు. ఫాసిస్టు ప్రమాదం రోజురోజుకూ పెరుగుతోంది.
ఈ గ్లోబల్ దుష్టశక్తి నయా ఉదారవాద ముసుగులో నేడు తలెత్తింది. యావత్ దేశాల ప్రజలను, వనరులను కొల్లగొడుతున్నారు. యుగస్లోవియా, ఇరాక్, అఫ్ఘానిస్తాన్, లిబియా, సిరియాలకు వ్యతిరేకంగా దురాక్రమణలకు పాల్పడ్డారు. వెనిజులా, నికరాగ్వే, బెలారస్‌లో ప్రభుత్వాలను కూల్చివేసే పథకాలను రూపొందించారు. రష్యా, చైనా, క్యూబా, ఉత్తర కొరియా ప్రజలకు వ్యతిరేకంగా ఆంక్షలు విధించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో రెచ్చిపోయిన హిట్లర్ మూకలు కొత్త రూపాల్లో విరుచుకుపడ్డాయి. ఈ భూమండలం నుంచి ఆ శక్తులు అదృశ్యం కాలేదు. బాల్టిక్ దేశాల్లో నాజీ కిరాతకులు భయంకర ప్రదర్శన నిర్వహిస్తున్నారు.
ఉక్రెయిన్‌లో నాజీ భావజాలం ప్రభుత్వ భావజాలంగా మారింది.అమెరికా, నాటో దేశాల పూర్తి మద్దతు దానికున్నది. ఉక్రెయిన్‌లో నిర్బంధశిబిరాలు వెలిశాయి. ప్రతిపక్షాలను నిషేధించారు. కమ్యూనిస్టులపై నిర్బంధకాండ కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలను సజీవదహనం చేస్తున్నారు.
పశ్చిమ దేశాల ప్రభుత్వాలు ఉక్రెయిన్ నాజీలకు ఆయుధాలకు దండిగా సరఫరా చేస్తున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అణ్వాస్త్రాల కోసం ఉవ్విళ్లూరుతున్నారు. ప్రమాదకరమైన హెచ్చరికలు లండన్ నుంచి వస్తున్నాయి. నయా నాజీ ప్రభుత్వానికి మారణాయుధాలను లండన్ నుంచి సరఫరా చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా నాటో దేశాల సైనిక స్థావరాలు ఏర్పాటయ్యాయి. వివిధ దేశాల్లో అమెరికాకు చెందిన 400 బయో ల్యాబరేటరీలను ఏర్పాటు చేశారు. యావత్ మానవాళికి ప్రమాదం ముంచుకొస్తోంది.
కమ్యూనిస్టులు మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. ‘ఫాసిజం అంటే యుద్ధం’, దానికి ఒకే ఒక్క సమాధానం ఉన్నది. ఫాసిస్టు రక్కసిని ఓడిరచాలి! నిర్లక్ష్యం కూడదు! మరొక యుద్ధం జరగరాదు!
అనేక దేశాల్లో నియంతృత్వశక్తులు అధికారంలోకి వచ్చాయి. వీటి వెనుక అంతర్జాతీయ ద్రవ్యఆర్థిక ప్రభువుల ప్రయోజనాలు ఉన్నాయి. కుహనా మేధావుల పరిశోధనలకు వీటి నుంచి మద్దతు లభిస్తున్నది. నిషే సిద్ధాంతాలను వ్యాపింపజేస్తున్నారు. చాంబర్లెన్ జాత్యాహంకార సిద్ధాంతాలను తలకెత్తుకున్నారు. సామాజికాభివృద్ధి కంటే సాంకేతికాభివృద్ధి గొప్పదని చాటుతున్నారు. మానవతావాదానికి వక్రబాష్యం చెబుతున్నారు. హిట్లర్ పాతభావాలను మరో రూపంలో బలపరుస్తున్నారు. మానవాళిని నియంత్రించి తమ అధీనంలో ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నయా ఉదారవాదం దేశాల స్వతంత్రాభివృద్ధిని, ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేస్తోంది. పశ్చిమ దేశాల రాజకీయ వ్యవస్థ నిరంకుశ వ్యవస్థలుగా మారాయి. స్వేచ్ఛ
స్వాతంత్య్రాలు, మానవతావాద విలువలకు వీరు వ్యతిరేకం. నయా ఫాసిజం ముంచుకొస్తోంది. హిట్లర్, ముస్సోలిని, ఫ్రాంకో, సాలజార్, క్విస్లింగ్, మ్యానర్‌హీమ్ వారసులు తయారయ్యారు. ‘నూతన ప్రపంచ వ్యవస్థ’కు పథకాలను రూపొందించారు. నూతన ప్రపంచ యుద్ధం ప్రమాదం ముంచుకొస్తున్నది. దురాక్రమణలు, సంఘర్షణలు, నయా ఫాసిజం, నయా వలసవాదం` ఇవి ప్రపంచ యుద్ధ ప్రమాదానికి సూచికలు. యావత్ ప్రపంచమే ఒక యుద్ధ రంగంగా మారింది. ఈ పోరాటంలో మనం గెలవాలి. మానవాళి ఉజ్వల భవిష్యత్‌ను కాపాడాలి. అంతర్జాతీయ సంఫీుభావాన్ని సమీకరించాలి. బెలారస్ నుంచి… ఆ పవిత్ర భూమి నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గతం, వర్తమానం, భవిష్యత్తు విడదీయరానివి.
ప్రియమైన మిత్రులారా!
రెండవ ప్రపంచ యుద్ధంలో కమ్యూనిస్టులు, దేశభక్తులు, ప్రజాస్వామ్యవాదుల పొత్తు ఏర్పడిరది. సామాజిక భావజాల విభేదాలు ఉండవచ్చు. రాజకీయ మత దృక్పథాలు వేరుగా ఉండవచ్చు. ఐక్య కార్యాచరణకు కదిలి వద్దాం. నయా నాజిజం, సైనికవాదం వ్యతిరేకంగా ఐక్యపోరాటానికి ముందుకెళదాం. ప్రగతిశీలశక్తుల ఐక్యత వర్థిల్లాలి!