Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 13, 2024
Friday, September 13, 2024

భారత్‌ మధ్యవర్తిత్వం మంచిదే

ఉక్రెయిన్‌తో యుద్ధంపై పుతిన్‌

మాస్కో: దాదాపు రెండున్నరేళ్లుగా ఎడతెరిపిలేని దాడులతో ఉక్రెయిన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రష్యా తాజాగా శాంతి చర్చల ప్రస్తావన తెచ్చింది. భారత్‌, చైనా, బ్రెజిల్‌ దేశాలు మాస్కో-కీవ్‌ మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించగలవని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చెప్పారు. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల వార్తా సంస్థ వెల్లడిరచింది. ఇప్పటికే యుద్ధం మొదలైన తొలి వారంలోనే తుర్కియేలోని ఇస్తాంబుల్‌లో కుదిరిన ప్రాథమిక ఒప్పందాన్ని ఉక్రెయిన్‌ అమల్లోకి తేలేదని ఆయన విమర్శించారు. ఆ ఒప్పందం ఆధారంగానే భవిష్యత్తులో శాంతి చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు. వ్లాదివాస్తోక్‌లో జరుగుతున్న ఈస్ట్రన్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సు సందర్భంగా పుతిన్‌ ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం వెల్లడిరచారు. తాము ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధంగానే ఉన్నామన్నారు. తాము ఎన్నడూ వాటిని తిరస్కరించలేదని, అసంబద్ధ డిమాండ్ల ఆధారంగా వీటిని చేపట్టలేమని పుతిన్‌ చెప్పారు. ‘ఇస్తాంబుల్‌లో జరిగిన చర్చల్లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడి ప్రతినిధుల బృందం ఒప్పందంపై సంతకం చేసింది. అంటే ఆ షరతులపై ఉక్రెయిన్‌ సంతృప్తిగా ఉన్నట్లే కదా. అమెరికా, ఐరోపా ఒత్తిడి కారణంగానే ఇది అమల్లోకి రాలేదు. రష్యాను వ్యూహత్మకంగా ఓడిరచాలని కొన్ని ఐరోపాదేశాలు కలగంటున్నాయి’ అని పుతిన్‌ విమర్శించారు. మరోవైపు క్రెమ్లిన్‌లో పుతిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ మాట్లాడుతూ శాంతి ప్రక్రియలో భారత్‌ కీలకమని పేర్కొన్నారు. ఆయన ఈస్ట్రన్‌ ఎకనామిక్‌ ఫోరం వద్ద ఓ పత్రికప్రతినిధితో మాట్లాడుతూ భారత ప్రధాని మోదీ-పుతిన్‌ మధ్య నిర్మాణాత్మక, స్నేహపూర్వక సంబంధాలున్నట్లు తెలిపారు. మోదీకి మాస్కో, కీవ్‌, వాషింగ్టన్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని, ఈ సౌలభ్యాన్ని వినియోగించుకొని దిల్లీ శాంతికి బాటలు వేయవచ్చన్నారు. ఉక్రెయిన్‌లో తన లక్ష్యాలు సాధించేంత వరకు రష్యా సైనిక చర్య కొనసాగిస్తుందని పెస్కోవ్‌ పేర్కొన్నారు. అమెరికా, ఐరోపా దేశాలకు దౌత్య పరిష్కారంలో ఆసక్తి లేదని విమర్శించారు. విదేశీ సైనిక నిపుణులు ఉక్రెయిన్‌లో చేపట్టిన యుద్ధ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఆరోపించారు. అమెరికా ఎన్నికలపై పెస్కోవ్‌ మాట్లాడుతూ ట్రంప్‌తో పోలిస్తే కమలాహారిస్‌ను అంచనా వేయడం తేలికని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img