Monday, August 15, 2022
Monday, August 15, 2022

మాడ్రిడ్‌లో నాటో వ్యతిరేక భారీ ర్యాలీ

మాడ్రిడ్‌ : ‘‘నాటోకు స్థానం లేదు! సామ్రాజ్య వాద యుద్ధం వద్దు..అంటూ మాడ్రిడ్‌లో జరిగే నాటో సమావేశానికి వ్యతిరేకంగా దాదాపు 10వేల మంది భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో జూన్‌ 29,30 తేదీల్లో జరిగే నాటో సమావేశానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ గ్రీస్‌ (కేకేఈ), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ వర్కర్స్‌ ఆఫ్‌ స్పెయిన్‌ (పీసీటీఈ) సభ్యులు, మద్దతుదారులు భారీ సంఖ్యలో ఈ నిరసనలో పాల్గొన్నారు. గ్రీకు, స్పానిష్‌ భాషల్లో నాటో స్థావరాలను వదిలి వెళ్లాలని డిమాండ్‌ చేశారు. క్యూబా కవి నికోలస్‌ గిల్లెన్‌ పద్యాలు ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా నిలిచాయి. ఉక్రెయిన్‌లో నిర్బంధంలో ఉన్న మిఖాయిల్‌, అలెగ్జాండర్‌ కానోనొవిచ్‌ యువ కమ్యూనిస్టులకు నిరసనకారులకు తమ సంఫీుభావాన్ని తెలిపారు. వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ యూత్‌ (డబ్ల్యుఎఫ్‌డీవై), డబ్య్యుఎఫ్‌డీవైలో సభ్యులుగా ఉన్న ఇతర కమ్యూనిస్ట్‌ యూత్‌లు, వరల్డ్‌ పీస్‌ కౌన్సిల్‌ (డబ్ల్యుపీసీ) స్పెయిన్‌, పోర్చుగల్‌. గ్రీస్‌ దేశాల శాంతి కమిటీల సంస్థలు ఉన్నాయి. ర్యాలీ ముగింపులో, ప్లాజా డి ఎస్పానా సమీపంలో, కేకేఈ ప్రధాన కార్యదర్శి అస్టర్‌ గార్సియా కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ వర్కర్స్‌ ఆఫ్‌ స్పెయిన్‌ (పీసీటీఈ)ప్రతినిధి బృందానికి ధన్యవాదాలు తెలిపారు. శ్రామికవర్గ అంతర్జాతీయవాదం ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. సామ్రాజ్యవాదాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. నాటోకు వ్యతిరేకంగా, సామ్రాజ్యవాద యుద్ధాలకు వ్యతిరేకంగా మాడ్రిడ్‌, ఏథెన్స్‌లో ప్రపంచవ్యాప్త పోరాటం సజీవంగా ఉందని పేర్కొన్నారు. సోషలిజం-కమ్యూనిజం కోసం చేపట్టిన పోరాటంలో పెట్టుబడిదారీ దోపిడీకి వ్యతిరేకంగా, మానవాళి శాంతికి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img