జెనీవా : ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్‌లో సార్వభౌమ దేశాలపై దాడిని, సమస్య లను రాజకీయం చేయడాన్ని తక్షణమే నిలిపి వేయాలని క్యూబా,వెనిజులా డిమాండ్ చేశాయి. బెలారస్‌కు వ్యతిరేకంగా ఆమోదించిన తీర్మానాన్ని ఖండిరచాయి. 50వ రెగ్యులర్ సెషన్ చివరి రోజున క్యూబా ప్రతినిధి జైరో రోడ్రిగ్జ్, సమ్మతి లేకుండా దేశాలకు వ్యతిరేకంగా ఆదేశాలు, తీర్మానాలను విధించడాన్ని క్యూబా తిరస్కరిం చింది. మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడే ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలను అంతర్జాతీయ చట్టాలు, చార్టర్‌కు అనుగుణంగా సమానత్వం, పరస్పర గౌరవంపై దృష్టి పెట్టాలని సూచిం చారు. రాజకీయీకరణను నివారించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. మహిళలు, బాలికలపై అన్ని రకాల వివక్షల నిర్మూలనపై అర్జెంటీనా, మెక్సికో, చిలీలు సమర్పించిన అనేక తీర్మానాలను కౌన్సిల్ ఓటు లేకుండా ఆమోదించింది.