Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

మార్చి 1న భారత్‌కు ఆంటోనియో బ్లింకెన్‌

వాషింగ్టన్‌: అమెరికా మంత్రి ఆంటోనియో బ్లింకెన్‌ వచ్చే వారం భారత్‌లో పర్యటించనున్నారు. జీ20 విదేశాంగ శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు మార్చి 1న బ్లింకెన్‌ భారత్‌కు రానున్నట్లు అధికారిక ప్రకటన పేర్కొంది. భారత్‌తో అమెరికా భాగస్వామ్యాన్ని మరింత పటిష్టపర్చుకోవడమే బ్లింకెన్‌ పర్యటన ఉద్దేశంగా తెలిపింది. గతేడాది డిసెంబరు నుంచి జీ20 అధ్యక్షతను భారత్‌ చేపట్టిన విషయం విదితమే. బ్లింకెన్‌ రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంచుకోవడంపై దృష్టి పెట్టనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికారి నెడ్‌ప్రైస్‌ వెల్లడిరచారు. బహుళపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు ఆహార సహకారం, ఇంధన భద్రత, సుస్థిరాభివృద్ధి, కౌంటర్‌నార్కోటిక్స్‌, అంతర్జాతీయ ఆరోగ్యం, మానవతా విపత్తు సాయం, లింగ సమానత్వం, మహిళా సాధికారత వంటి అన్ని అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. బ్లింకెన్‌ తన పర్యటనలో భాగంగా భారతదేశ ప్రభుత్వ అధికారులను కలుస్తారని, మార్చి 3వ తేదీ వరకు భారత్‌లో ఉంటారని అన్నారు. ఈనెల 28 నుంచి కేంద్ర ఆసియా దేశాలైన కజకస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌లో బ్లింకెన్‌ పర్యటిస్తారని, అక్కడ సీ5G1 మంత్రులతో భేటీ అవుతారని చెప్పారు. ఉజ్బెకిస్తాన్‌ నుంచి నేరుగా భారత్‌కు బ్లింకెన్‌ చేరుకుంటారని వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img