Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

మెక్సికోతో కలిసి పనిచేస్తాం: చైనా


బీజింగ్‌: మెక్సికో 200వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అభినందనలు తెలిపారు. సుదీర్ఘ చరిత్ర, అధ్బుతమైన నాగరికత కలిగిన మెక్సికో ఒక ముఖ్యమైన లాటిన్‌ అమెరికా దేశంగా జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. మెక్సికన్‌ ప్రజలు తమ పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధిని సాధించడంలో విశేషమైన విజయాలు సాధించారని నాగరికత పురోభివృద్ధికి ఎనలేని కృషి చేశారని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. చైనా, మెక్సికో రెండు విస్త్రత ఉమ్మడిప్రయోజనాలతో అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పేర్కొన్నారు. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్‌ ఒబ్రడార్‌ నూతన అభివృద్ధి సంస్కరణలు ప్రోత్సహిస్తున్నారని అభినందించారు. మెక్సికో తన జాతీయనిర్మాణంలో మరిన్ని విజయాలు సాధించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నట్లు జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. చైనామెక్సికో సంబంధాల అభివృద్దికి తాను చాలా ప్రాముఖ్యతనిస్తున్నానన్నారు. పరస్పర ప్రయోజనకరమైన సహకారానికి, పరస్పర విశ్వాసాన్ని పెంపొందించడానికి చైనామెక్సికో సంబంధాలు నూతన స్థాయికి చేరేందుకు ఒబ్రడార్‌తో కలిసి పనిచేసేందుకు ుతాను సిద్ధంగా ఉన్నానని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img