Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

మైన్మార్‌లోని 37ప్రాంతాల్లో మార్షల్‌ లా

యంగావ్‌: మైన్మార్‌లోని నాలుగు రాష్ట్రాల్లోగల 37 పట్టణాల్లో మార్షల్‌ లా విధించినట్లు ఆ దేశ పాలకమండలి ప్రకటించింది. మార్షల్‌ లా విధించిన పట్టణాల్లో 11 సగైంగ్‌ ప్రాంతంలో ఉండగా ఏడు చిన్‌ రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే మగ్వే, బాగో ప్రాంతాల్లో ఐదు చొప్పున, కయా రాష్ట్రంలో నాలుగు, తనిన్‌థాయి ప్రాంతంలో, కెయిన్‌ రాష్ట్రంలో చెరో రెండు ఉన్నట్లు అధికారిక ప్రకటన పేర్కొన్నాయి. శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతలను సంబంధిత మిలటరీ కామాండ్‌ల కమాండర్లకు పాలకమండలి అప్పగించింది. పారిపాలన, న్యాయపరమైన అధికారాలను కట్టబెట్టింది. మరో ఆరు నెలలు అత్యవసర పరిస్థితి కొనసాగుతుందని ప్రకటించిన మరుసటి రోజు తాజా పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img