Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

మైన్మార్‌్‌లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం

నైపిడా : మైన్మార్‌లో ఆర్థిక సంక్షోభం తీవ్రమైంది. డబ్బులు దొరక్క ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఏటీఎం కేంద్రాల వద్ద నగదు విత్‌ డ్రా చేసేందుకు ప్రజలు పడిగాపులు పడుతున్నారు. ఆరు నెలల క్రితం సైన్యం అధికారాన్ని చేజిక్కించుకోవడంతో ఈ పరిస్థి తులు దాపురించాయి. సైన్యానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచి పోయాయి. సైనిక ప్రభుత్వం ఆన్‌లైన్‌ చెల్లింపులపై నిషేధం కారణంగా సంక్షోభం పెరిగింది. మరోవైపు ఇంటర్నెట్‌ షట్‌ డౌన్‌ కారణంగా కూడా నగదు లభిం చడం లేదు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి మైన్మార్‌ సాక్షీభూతంగా నిలిచింది. నగదు కొరత ఏర్పడిరది. నగదు విత్‌డ్రా చేయడానికి తెల్లవారుజామున 3 గంటల నుంచే ఏటీఎంల వద్ద జనం క్యూ కడుతున్నారు. మధ్యా హ్నం వేళలో బ్యాంక్‌ ఖాతాల నుంచి డబ్బు తీసుకోవడా నికి వేచి ఉంటున్నారు. బ్యాంకుల్లో ప్రజల రద్దీని తగ్గించడానికి ఏటీఎంలలో కరెన్సీ నోట్లను నింపుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. ఒక వ్యక్తి రూ.9 వేలకు మించి విత్‌డ్రా చేయకుండా నిబంధనలు పెట్టారు. కార్మికులకు జీతాలు చెల్లించానికి సంస్థలు ఇబ్బంది పడుతున్నాయి. మైన్మార్‌ కరెన్సీ క్యాట్‌ విలువ డాలర్‌తో పోలిస్తే 20 శాతం పడిపోయింది. దేశంలో 100 కంటే తక్కువ ఏటీఎంలలో నగదు లభిస్తున్నది. కరెన్సీ నిల్వల కోసం చాలా మంది వ్యాపారులు డిజిటల్‌ చెల్లింపులకు బదులుగా నగదు తీసుకుంటున్నారు. నగదు కోసం ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. కరెన్సీ బ్రోకర్లు మాత్రం రెచ్చిపోతున్నారు. కమీషన్‌పై ఆన్‌లైన్‌ చెల్లింపునకు బదులుగా 7 నుంచి 15 శాతం కమీషన్‌ తీసుకుని నగదును ఇస్తున్నారు. దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైనిక తిరుగుబాటు తర్వాత జరిగిన హింసలో ఇప్పటివరకు 945 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది సైన్యం కాల్పుల్లో మరణించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img