Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023

మైన్మార్‌ ప్రధానిగా హ్లయింగ్‌ ..!

నైపిడా : మైన్మార్‌ ఆర్మీ చీఫ్‌ యంగ్‌ మిన్‌ ఆంగ్‌ హ్లయింగ్‌ దేశ ప్రధానిగా తనకుతానే ప్రకటించుకు న్నారు. 2023 తర్వాత ఎన్ని కలు నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. దేశ ప్రధానిగా ఆగస్టు1న హ్లయింగ్‌ బాధ్యతలు స్వీకరించారు. జాతీయ అత్యవసర పరిస్థితిని మరో రెండు సంవత్సరాలు పొడిగిస్తా మని ప్రకటించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్ని కైన అంగ్‌సాన్‌ సూకీ ప్రభుత్వాన్ని కూల్చి.. జుంటా సైన్యం దేశాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్న విషయం తెలిసిందే..‘మైన్మార్‌ సంరక్షక ప్రభుత్వం’ పేరుతో స్టేట్‌ అడ్మినిస్ట్రేషన్‌ కౌన్సిల్‌ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. గతవారం ఎన్నికల ఫలితా లను రద్దు చేసిన ప్రభుత్వం కొత్త ఎన్నికల కమిషన్‌ను నియమించింది. ఈ సందర్భంగా హ్లయింగ్‌ మాట్లాడుతూ.. ఆసోసియేషన్‌ ఆప్‌ ఆగ్నేయాసియా నేషన్స్‌ పేరుతో భవిష్యత్‌లో ఆసియన్‌ దేశాలు నియమించే ప్రాంతీయ రాయబారులతో కలిసి పనిచేసేందుకుతమ ప్రభు త్వం సిద్ధంగా ఉందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img